నవంబర్ 23 నుంచి 8వ తరగతి విద్యార్థులకు తరగతులు.

క్రమేణా ఉన్నత పాఠశాలల్లో అన్ని తరగతులు నిర్వహణకు ఏర్పాట్లు
అమరావతి : ఈనెల 23 సోమవారం నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయించింది.
ఇప్పటికే ఈనెల 2 నుంచి 9, 10 తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు.
విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు సుముఖంగా ఉండటం తో పాటు హాజరు శాతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 8వ తరగతి విద్యార్థులకు కూడా పాఠశాలల్లో తరగతులు నిర్వహించాలని నిర్ణయించటం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
8, 9 తరగతుల విద్యార్థులు రోజుమార్చి రోజు పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. 10 వ తరగతి విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఈ మూడు తరగతుల విద్యార్థులకు బోధన జరుపుతూ డిసెంబర్ 14 నుంచి 6, 7 తరగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
“14వ తేదీ తరువాత అప్పటి పరిస్థితి సమీక్షించుకుని 1-5 తరగతులపై నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 వరకు జరుగుతున్న పాఠశాలలు చలికాలం కారణంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వటం జరిగింది,” అని మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *