అఖిల భారత ట్రేడ్ యూనియన్లు ఈ నెల 26 న జరుప తలపెట్టిన సమ్మెలో అమరావతి లోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలేవీ పాల్గొనవని ఎపి జెఎసి అమరావతి నేతలు బొప్పరాజు, వైవి రావు, వివి మురళి కృష్ణ నాయుడు . స్పష్టతనిచ్చారు.
ఈ మేరకు వారు ఈ రోజు ఒక ప్రటకన విడుదల చేశారు.
ప్రకటన పూర్తి పాఠం:
ఈ నెల 26 వ తేదీన అఖిల భారత స్థాయిలో ట్రేడ్ యూనియన్ లు సార్వత్రిక సమ్మె చేస్తున్నట్లు పత్రికలలో వచ్చిన వార్తలు వచ్చాయి. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల సమ్మెలో పాల్గొనడం గురించి తమని సంప్రదిస్తున్నందున స్పష్టత ఇస్తున్నాం. ఈ సమ్మెలో ఎపి జెఎసి అమరావతిలోని 94 సభ్యసంఘాలు మరియు ఆయా శాఖాపరమైన శాఖల ఉద్యోగులు ఎవరూ పాల్గొనడం లేదు.
◆ కార్మికుల సమస్యలపట్ల మాకు అత్యంత సానుభూతి ఉన్నది. కానీ జాతీయ స్థాయిలో చేపట్టేకార్యక్రమాలను ముందుగా రాష్ట్ర స్థాయిలో ఉద్యోగ సంఘాలతో సంప్రదించకుండా వారు సమ్మె చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.
◆ మన రాష్ట్రం లో అనేక నిరసన కార్యక్రమాల తర్వాత ఉద్యోగులకు అత్యంత అవశ్యకమైన హక్కుల సాధన మరియు అత్యవసరమైన సమస్యల పరిష్కారానికి ఆఖరి అస్త్రంగా మాత్రమే సమ్మె చేసే విధానం ఇక్కడ కొనసాగుతున్నది.
◆ AP JAC అమరావతి లోని అన్నీ సభ్య సంఘాలతోచర్చించి నిర్ణయించిన ప్రకారము సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయించాము.
” కరోనా నేపథ్యంలో ప్రభుత్వాలకు ఏర్పడిన సమస్యలను మరియు Epidemic deseases act1897 act ప్రకారము ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన అనేక ఉత్తర్వులు అమలులో ఉన్నందున APJAC అమరావతిలోని 94 సభ్య సంఘాలు మరియు ఆయా శాఖాపరమైన శాఖల ఉద్యోగులు ఈ సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం.”