పవిత్ర తుంగభద్ర నదీ పుష్కరాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. నేటి నుంచి డిసెంబరు 1 వరకు పుష్కరాలు సాగుతాయి.
కర్నూలు పట్టణంలోని సంకల్ భాగ్ పుష్కర ఘాట్ వద్ద తుంగభద్ర నదీమతల్లికి సీఎం పూజలు చేశారు.
2008 డిసెంబర్ 12న తుంగభద్ర పుష్కరాలు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడి నుంచే పుష్కరాలు ప్రారంభించారు. ఇపుడు ఇదే చోటి నుంచి పుష్కర కాలం (12 సంవత్సరాలు) తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఈ మధ్యాహ్నం పుష్కరాలు ప్రారంభించారు.
కర్నూలు సంకల్ భాగ్ పుష్కర ఘాట్ వద్ద వేదమంత్రాల నడుమ ఆయన నదీమ తల్లికి పుష్కర ప్రారంభ క్రతువు నిర్వహించారు.
మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరుడు నదిలో ప్రవేశిస్తాడన్న ముహూర్త ఘడియలు పాటిస్తూ సీఎం జగన్ తుంగభద్రమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై హారతి ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. పుష్కరాల ప్రారంభోత్సవంలో సీఎం జగన్ వెంట మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు. తుంగభద్ర పుష్కరాలు నేటి నుంచి డిసెంబరు 1 వరకు జరగనున్నాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుష్కరాలు ప్రారంభించేనాటికి ఉమ్మడి మద్రాసు రాష్టమే ఉండింది. అందువల్ల నదికి అటువైపు అలంలపూర్ వద్ద కూడా పుష్కరాలను ప్రారంభించారు.