(CS Saleem Basha)
క్రికెట్ లో అత్యున్నత స్థాయి టోర్నమెంట్ “ ప్రపంచ కప్”. 1975 లో మొదటిసారి ప్రపంచ కప్ టోర్నమెంట్ జరిగింది. అప్పటికి ఇంకా టెస్ట్ మ్యాచ్ ల హవా నడుస్తూ ఉండింది.
*మొదటిసారి ఒక ప్రపంచ కప్ అంటే అందరికీ విపరీతమైన ఆసక్తి ఉండింది. ఈ టోర్నమెంట్ విజేత శక్తివంతమైన వెస్టిండీస్. 1979 లో కూడా అదే జట్టు గెలిచింది.
*1983 లో ఇండియా చరిత్ర క్రియేట్ చేస్తూ గెలవడం అందరికీ తెలిసిన విషయమే.
*1975 నుండి 2019 వరకు ప్రపంచ కప్ ఎన్నో మార్పులు గురయ్యింది. ఎన్నో విశేషాలను పోగు చేసుకుంటూ వస్తోంది. మొదట్లో 60 ఓవర్లు ఆడే మ్యాచ్ లు, ఇప్పుడు 50 ఓవర్లకు కుదించబడ్డాయి.
* ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రపంచ కప్ గెలవని ప్రముఖ దేశాలు రెండే. ఒకటి దక్షిణాఫ్రికా రెండు న్యూజిలాండ్.
* ఇంగ్లాండ్ మొదటి ఐదు ప్రపంచ కప్ లో అన్నింటిలోనూ సెమీ ఫైనల్స్ వెళ్ళింది. అయితే 3 సార్లు మాత్రమే ఫైనల్స్ కు వెళ్ళింది.
*ప్రపంచ కప్ లో 1000 పరుగులు చేసిన మొదటి ఆటగాడు వివియన్ రిచర్డ్స్.
*వెస్టిండీస్ మేటి ఆటగాడు గ్యారీ సోబర్స్ 1975 వరల్డ్ కప్ కు సెలెక్ట్ అయ్యాడు . కానీ దురదృష్టవశాత్తు అందులో పాల్గొన లేకపోయాడు. అతను కేవలం ఒక ODI మాత్రమే అందులో కూడా డక్ అవుట్ అయ్యాడు.
*1996 ప్రపంచ కప్ లీడ్ మ్యాచ్ పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్ను నిజానికి day and night మ్యాచ్ గా షెడ్యూల్ చేశారు. అయితే మల్లి దాన్ని డే మ్యాచ్ గా మార్చారు. ఎందుకంటే లైట్స్ ఆ సమయంలో సిద్ధంగా లేనందువలన.
*1992 వరల్డ్ కప్ అందుకునే టప్పుడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సహచరులకు కృతజ్ఞతలు తెలపడం మరచిపోయాడు. దానికి విమర్శలు అందుకున్నాడు. అయితే పదేళ్ల తర్వాత 2002లో పాకిస్థాన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచి 10 సంవత్సరాల అయిన సందర్భంగా ఇచ్చిన విందులో తన తప్పును సరి దిద్దుకున్నాడు.” మ్యాచ్ గెలిచిన తర్వాత నాకు మాటలు రాలేదు. నేను మాట్లాడడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే మేము ప్రపంచకప్ గెలిచే అవకాశాలు దాదాపుగా లేని పరిస్థితి నుంచి ఫైనల్స్ వరకు వచ్చాము. అదీ విషయం” అని చెప్పుకొచ్చాడు .
* ఇంతవరకు వరల్డ్ కప్ లో సూపర్ ఓవర్ మ్యాచ్ 2019 లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆడారు. ఈ ఫైనాన్స్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఇంతవరకు కప్ గెలవని రెండు జట్ల మధ్య జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ ఇది. ఇంగ్లాండ్ కల నెరవేరిన మ్యాచ్ ఇది. మొదటిసారి ఇంగ్లాండ్ కప్ గెలుచుకుంది. న్యూజిలాండ్ దురదృష్టవశాత్తు తృటిలో చేజార్జుకుంది కప్ పోగొట్టుకుంది. సూపర్ ఓవర్ కూడా టై కావడంతో, ఇంగ్లాండ్ విజేతగా ప్రకటించారు. దానికి కారణం ఇంగ్లాండ్ ఎక్కువ బౌండరీలు(23) సాధించడమే. ఒకరకంగా ఇది అన్యాయంగా భావించిన ఐసీసీ ఈ రూల్ ని ఇప్పుడు తొలగించింది. ఇప్పుడు సూపర్ ఓవర్ కూడా టై అయితే, మళ్లీ సూపర్ ఆడాల్సిందే.
(సిఎస్ సలీమ్ బాషా స్పోర్ట్స్ జర్నలిస్టు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ప్రవృత్తి – 9393737937)