అహ్మదాబాద్ లో తాజాగా కరోనా కర్ఫ్యూ మొదలు…

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీలో మార్కెట్లలో లాక్ డౌన్ పెట్టే యోచన చేస్తుంటే గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో రాత్రిపూట కర్ఫ్యూ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 9 నుంచి మరుసటి రోజు ఉదయం 6 దాకా ఈ కర్ఫ్యూ కొనసాగుతుంది.
పండగ సీజన్ ముగిసిందోలేదో చాలా మంది ఆందోళన చెందినట్లు కరోనా కేసులు పెరగడం మొదలయింది.
అహ్మదాబాద్ లో ఒక్క సారిగా కేసులు ఉధృతమయ్యాయి. దీనితో రోగులకోసం ఆసుపత్రులలో పడకలను సిద్ధంచేస్తున్నారు.
నగరంలోని ఆసుపత్రులలో  40 శాతం పడకలను  కరోనా రోగుల కోసం అందుబాటులో ఉంచినట్లు గుజరాత్ ప్రభుత్వ అదనపు ప్రధాన  కార్యదర్శి  రాజీవ్ కుమార్ గుప్తా చెప్పారు.
కేసులు పెరుగుతుండటంతో గుప్తాని కోవిడ్-10 ఒఎస్ డి (Officer-on-Special Duty) నియమించారు. నగరంతోని ఏడు ప్రభుత్వ ఆసుపత్రులలో  7,279 పడకలకు కోవిడ్-19రోగులకు కేటాయించినట్లు ఆయన చెప్పారు.
ఇక 76 ప్రయివేటు ఆసుపత్రులకు సంబంధించి2,848 పడకలను సిద్ధంచేశారు.
ఒక్క బుధవారంనాడే  220 కొత్త కరోనా కేసులు కనిపించాయి. దీనితో రాష్ట్రంలో కేసుల సంఖ్య 46,022 కు చేరింది.
కొత్తగా అయిదుగురు కోవిడ్ తో చనిపోయారు. అహ్మదాబాద్ కరోనా కంటైన్ మెంట్ జోన్ల సంఖ్య కూడా పెరిగింది. కొత్త గా 14 జోన్లు చేరడంతో మొత్తంకంటైన్ మెంట్ జోన్ల సంఖ్య 100కి చేరింది.
కరోనా కేసులు కనిపించగానే అపార్టమెంట్లతో పాటు స్వతంత్ర గృహాలను కూడా కంటైన్ మెంట్ జోన్లు గాఅధికారులుప్రకటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *