తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ కేసు మూసివేతకు టీటీడీ ధర్మకర్తల మండలి,ఉన్నతాధికారుల అత్యుత్సాహం చూపుతున్నారు. ఎవరి మెప్పు కోసమో!ఇది టీటీడీ ప్రతిష్ఠతో పాటు భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం. భక్తుల మనోభావాలను కించపరిచే హక్కు అధికారం ఎవ్వరికీ లేదు!
శ్రీవారి పింక్ డైమండ్ కేసు ఉపసంహరించుకుంటామని ఇటీవల జరిగిన ధర్మకర్తల మండలిలో తీర్మానం చేశారు. దీనితో భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో తిరిగి కేసు కొనసాగిస్తాం అని తిరుపతి కోర్టులో నిన్న పిటిషన్ వేశారు. దీనిలోని ఆంతర్యం ఏమిటి?
శ్రీవారికి పింక్ డైమండ్ ఉందా లేదా?ఈ విషయం కోర్టు ద్వారానే భక్తులకు తెలియాలి!
(నవీన్ రెడ్డి ఏమి చెబుతున్నారో చూడండి)
2018 లో విజయసాయి రెడ్డి,రమణ దీక్షితులు పింక్ డైమండ్ మాయమైందని ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. అపుడు ఈ ప్రకటనతో టీటీడీ అధికారులు తమ ట్రస్టు ప్రతిష్టకు భంగం కలిగిందని రు 200 కోట్ల పరువు నష్టం దావావేశారు. దీనికోసం శ్రీవారి సొమ్ము 2 కోట్లు కోర్టు ఫీజు కింద కట్టారు. ఇపుడు కేసు ఉపసంహరించుకుంటే ఈ రెండు కోట్ల రుపాయలు ఏమవుతాయి?
దానికి వడ్డీతో సహా వడ్డీ కాసులవాడు వసూలు చేస్తారు!
టిటిడి ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి తమ అధికార బలంతో కోర్టు నుంచి తప్పించుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి కోర్టులో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఎవరైనా శిక్ష తప్పదు! టిిటిడి భక్తులకు జవాబుదారిగా ఉండాలి.