హైదరాబాద్ : తెలంగాణలో బాణసంచాను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సవరించింది.దీనితో తెలంగాణలో టపాసుల పండగ జోరుగా జరుపుకునేందుకు అనుమతి వచ్చింది. టపాసుల నిషేధాన్ని సవరిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరిస్తూ గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతినిచ్చింది. ఎన్‌జీటీ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. తీర్పు వివరాలను వెల్లడిస్తున్న న్యాయవాది
రాత్రి 8-10 వరకు గ్రీన్ టపాసులు కాల్చేందుకు అవకాశం
బాణసంచా విషయంలో హైకోర్టు ఆదేశాలను సవరించిన సుప్రీంకోర్టు
గాలినాణ్యత సూచీల ఆధారంగా టపాసుల వినియోగంపై ఆంక్షలు వర్తింపు
కాలుష్యం సాధారణంగా ఉంటే 2 గంటలపాటు టపాసులు కాల్చుకునే అవకాశం
కాలుష్యంగా సాధారణంగా ఉన్న ప్రాంతంలో రాత్రి 8-10 వరకు గ్రీన్ టపాసులు కాల్చేందుకు అవకాశం
కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతంలో బాణసంచా పూర్తిగా నిషేధం
దీపావళితో పాటు క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకలకు తీర్పు వర్తింపు
ఈ నెల 9న ఎన్జీటీ ఇచ్చిన మార్గదర్శకాలకు హైకోర్టు ఆదేశాలను సవరించిన సుప్రీంకోర్టు