బీజేపీ కేంద్ర ప్రభుత్వం బీహార్ రాష్ట్రానికేనా… దేశానికి కాదా? ఇంత దివాళా రాజకీయాలా: బిజెపి పై విరుచుకుపడ్డ మంత్రి హరీష్ రావు
బీహార్ ఎన్నికల ప్రచారంలో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కరోనా మందును ఉచితంగా పంపిణీ చేస్తామని బిజెపి ఆశ పెట్టడం సిగ్గుచేటు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ఖ్యానించారు.
బీహార్ ఎన్నికల్లో ఓట్లకోసం ఇలా ఉచిత కరోనా మందును ఎర వేయడాన్ని విమర్శిస్తూ బిజెపి కేంద్ర ప్రభుత్వం బీహార్ కు మాత్రమే పనిచేస్తుందా, దేశానికి కాదా అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో అందునా దుబ్బాక ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వరా అని ఆయన విమర్శించారు. దీనికి సమాధానం తొందర్లో దుబ్బాక ప్రజలు చెబుతారని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఒకసభలో మా ట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించారు.
బీజేపీ గెలిస్తే బాయికాడ మీటర్లు కాంగ్రెస్ గెలిస్తే కరెంటు కష్టాలు మొదలవుతాయని అన్నారు. ఈ రోజు దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఆయన బిజెపిని తీవ్రంగా దుయ్యబట్టరు. బిజెపి అంటే భారతీయ ఝూటా పార్టీ అని బల్వంతపూర్ ఎన్నికల ర్యాలీలో మాట్టాడుతూ చెప్పారు.