టిటిడి అధికారులు తిరుపతి కోర్టులో పింక్ డైమండ్ కేసు ఉపసంహరణకు అఫిడవిట్ దాఖలు చేసింది, ఎవరికోసం ఈ నాటకం?
(నవీన్ కుమార్ రెడ్డి)
తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ వివాదం గుర్తుందా?
*శ్రీవారి పింక్ డైమండ్ కనబడుట లేదు అని వంశపారపర్యంగా శ్రీవారికి సేవలందిస్తున్న రమణ దీక్షితులు గారు ఆ మధ్య వెల్లడించారు. దీని మీద స్పందిస్తూ అది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటిలో ఉంది అని వైసిపి నేత విజయసాయిరెడ్డి గారు బహిరంగంగా ప్రకటించారు. ఇది చాలా సంచలనం సృష్టించింది. కోట్లాది మంది శ్రీవారి భక్తులు దీనితో ఎంతో ఆందోళన చెందారు!
* తర్వాత టిటిడి అధికారులు 2018 లో పింక్ డైమండ్ విషయమై 200 కోట్ల మేర టీటీడీ కి పరువు నష్టం జరిగిందని అందుకు బాధ్యులైన రమణదీక్షితులు మీద వైసిపి నేత విజయసాయి రెడ్డిల మీద కేసు పెట్టారు.
* శ్రీవారి సొమ్ము 2 కోట్ల పరువునష్టం కోర్టు ఫీజుగా కట్టారు.
* మరి ఇప్పుడు ఈ కేసును ఉపసహరించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరి ప్రోద్బలంతో కేసు ఉపసంహరించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు “శ్రీవారి సన్నిధిలో ప్రమాణం” చేసి భక్తులకు చెప్పండి!
* ఉపసంహరణ సరే, మరి కోర్టుకు భక్తులు సమర్పించిన ముడుపు నుంచి కట్టిన రు. 2 కోట్లు కోర్టు ఫీజు మాటేమిటి? అది గోడకు కొట్టిన సున్నమేనా!
* టిటిడి ఆగమ సలహా మండలిలో ఉన్న రమణ దీక్షితులు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గార్లు పింక్ డైమండ్ కేసు ఉపసంహరణకు టీటీడీ చేస్తున్న ప్రయత్నాల పై స్పందించాలి. ఆనాడు మీరు చెప్పిన విధంగా పింక్ డైమండ్ ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది అన్న వాస్తవాలు బహిర్గతం చేయాలి!
*మరి నేడు టిటిడి అధికారులు తిరుపతి కోర్టులో పింక్ డైమండ్ కేసు ఉపసంహరణకు అఫిడవిట్ దాఖలు చేసింది వాస్తవమా కాదా శ్రీవారి భక్తులకు సమాధానం చెప్పండి!
* శ్రీ వెంకటేశ్వర స్వామితో,భక్తుల మనోభావాలతో పింక్ డైమండ్ ఉందని కొంతమంది లేదని కొంతమంది దాగుడుమూతలు ఆడినవారిని కోర్టు కేసు ద్వారా శిక్షించాల్సింది పొయి రక్షించే ప్రయత్నం చేయడం మహా అపచారం కాదా!
* భక్తులకు తెలియకుండా భక్తుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం టిటిడి అధికారులు,ధర్మకర్తల మండలి చేయడం మహా పాపం??
* టీటీడీ వారు కోర్టు ఫీజు కింద కట్టిన 2 కోట్ల రూపాయలకు ఎవరు బాధ్యత వహిస్తారు పింక్ డైమండ్ కేసులో అప్పటి ఇప్పటి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం వాదులుగా ప్రతివాదులుగా ఉన్న వారి వ్యక్తిగత ఆస్తులను జప్తు చేసి తిరిగి శ్రీవారి ఖాతాలో జమ చేసిన తర్వాతే టీటీడీ కేసును ఉపసంహరించుకోవాలి!
* టీటీడీ లో కొంతమంది అధికారులు ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పింక్ డైమండ్ పై తిరుపతి కోర్టులో వేసిన కేసు నుంచి తప్పించుకోవచ్చు నేమో గాని వెంకటేశ్వర స్వామి కోర్టులో ఎవరు తప్పించుకోలేరు శిక్ష తప్పదు అని హెచ్చరిస్తున్నా!
(నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి, తిరుమలలో సాగే అక్రమాల మీద,సంప్రదాయ వ్యతిరేక కార్యకలాపాల మీద తరచు గళమెత్తే యాక్టివిస్టు)