కర్నూలు DEO అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలి

డిఈఓ, ఎస్ఎస్ఎ కార్యాలయంలో కార్లకుంభకోణం. జీఓ నెంబర్ 70కి విరుద్ధంగా అక్రమ బదిలీలు చేస్తున్న డిఈఓ పై విచారణ జరిపించాలి

కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం సాయిరామ్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి డిమాండ్ చేసింది.
స్థానిక కర్నూలు నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట రాయలసీమ యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్, ఆంధ్ర ప్రదేశ్ స్టూడెంట్స్ ఫెడరేషన్, తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్, బిసి యువజన విద్యార్థి ఫెడరేషన్, రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్, రాయలసీమ యునైటెడ్ యూత్ ఫెడరేషన్,బిసి స్టూడెంట్స్ యూనియన్, రాయలసీమ యువజన వేదిక సంఘాల నాయకులు కలిసి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఓ నెంబర్ 70 ప్రకారం పొస్టింగ్ లు ఇవ్వకుండా, అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కేటగిరీ 1 స్థానాలు (20% హెచ్ఆర్ఎ) ఇతర క్యాటగిరి వారికి కేటాయించిన వ్యవహారం పై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
 ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా స్థానాలు పొందిన వారి పోస్టులను రెగ్యులర్ బదిలీ కౌన్సిలింగ్ యందు ఖాళీగా చూపించాలని, నిరుద్యోగుల కడుపు కొట్టి నియమ నిబంధనలకు విరుద్దంగా తమ సొంత కారులను సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్, డిఈఓ కార్యాలయాలలో వాడుకుంటున్న అధికారుల పై సమగ్ర విచారణ చేసి, కార్ల కుంభకోణం సూత్రధారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కోనేటి వెంకటేశ్వర్లు, ఎంవిఎన్ రాజు యాదవ్, ఎద్దు పెంట అంజి, ఆకుమళ్ల శ్రీధర్, బండారి సురేష్ బాబు, బి భాస్కర్ నాయుడు, పల్లపు శంకర్, ఎం మోహన్ , బెస్త శ్రీనివాసులు, హరి కృష్ణ గౌడ్, శివ తదితరులు పాల్గోన్నారు.