రాయలసీమ సాహిత్యాన్ని ఇంటింటికి చేర్చేందుకు ఒక పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా తాము ప్రచురించిన పుస్తకాలన్నింటిని 50 శాతం రిబేటుఅందించేంుకు రాయలసమీ బుక్ సొసైటీ ముందుకు వచ్చింది. ఈ అవకాశాన్ని రాయలసీమ సాహిత్యాభిమానులు సద్వినియోగపర్చుకోవాలని ‘ఇంటింటా సీమ పుస్తకం’ నిర్మాహకులు కోరుతున్నారు.
వివరాలు
“మొదటితరం రాయలసీమ కథలు” (1882-1944)… పుస్తకం
డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి సంపాదకత్వంలో వెలువడింది.
మే- 2015 న అబ్జ క్రియేషన్స్ పక్షాన కోడిహళ్లి మురళీ మోహన్ ప్రచురించారు.
1882 నుండి 1944 మధ్య కాలంలోని 8 పాత పత్రికల ఆధారంగా, సీమలో వెలువడిన 42 కథలతో 240 పేజిలుగా ఈ పుస్తకం ఉంది. ప్రసిద్ధ కథకులు, విమర్శకులు కేతు విశ్వనాథరెడ్డి, సింగమనేని నారాయణలు ముందుమాటలు రాసారు. సంపాదకుడి విస్తృతమైన పీఠిక సీమ కథా మూలాలను తెలుపుతుంది.
1926 కంటే ముందే రాయలసీమ వెలువడిన 5 కథలు కూడా ఇందులో ఉన్నాయి.
1913 నాటి హిందూసుందరి పత్రికలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు పేరున వెలువడిన “రోజాంబ-శ్వేతాంబ” కథతోపాటు,
1923 లోనే రాయలసీమ స్థల, కాలాలతో నిర్దిష్టంగా ఈ ప్రాంత జీవితాన్ని చిత్రిస్తూ కొప్పర్తి నారాయణ రాసిన “అచ్చుబాటు కాని చదువు” కథ ఈ పుస్తకంలో ఉండడం విశేషం.
కథలన్నీ వస్తు, శిల్ప పరంగా అత్యంత ఆధునికంగా నడుస్తాయి.
1937 నాటి టి. ఆర్ముగం పిళ్ళై, 1938 నాటి కందాళ శేషాచార్యులు, 1939 నాటి విద్వాన్ విశ్వం లను ఈ పుస్తకం తొకలి సారిగా కథకులుగా సాహిత్య లోకంలో నిలబెట్టింది.
1927 నాడే సీమలో హెచ్. నంజుండరావు రాసిన చిన్న కథలు అనే కథాలక్షణ వ్యాసం, కొన్ని కథలపై విమర్శలు, అభిప్రాయాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. సీమ కథా విమర్శ మూలాలను ఇది చూపుతుంది.
ఎంతో శ్రమతో, పరిశోధన పై బాధ్యతతో మొదటితరం సీమకథలను వెలుగులోకి తీసుకొచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి గారి ఈ పుస్తకాన్ని పాఠకులకు చేరువ చేయాలని భావిస్తున్నాం.
యాభైశాతం డిస్కౌంట్ తో కేవలం 100 రుపాయలకు పుస్తకం అంద చేయాలని నిర్ణయించాము.
100 + రిజిస్టర్ పోస్టల్ చార్జీలు 20 కలిపి “మొత్తం…120 రుపాయలు” కింది నంబర్ కు ఫోన్ పే, గూగుల్ పే లేదా అకౌంట్ కు పంపిన వారికి, పదిరోజల్లో పుస్తకం మీ ఇంటికి చేరుస్తాం.
మాకు పంపిన వెంటనే ఆ విషయం, పూర్తి చిరునామ పిన్ కోడ్ తో కలిపి వాట్సప్ నెంబర్ కు లేదా ఫోన్ నెంబర్ కు పంపగలరు.
Phone pay & Google pay Number :
94922 87602
Bank A/C:
A/c No : 30955516254
IFSC. : SBIN0002722
Name : M. Ravi Kumar,
SBI, Gorantla,