కొందరంతే వృత్తిని దైవంగా భావిస్తారు. జడివానలను, మండే ఎండలను లెక్కచేయరు. అలా వృత్తిలో జీవిస్తుంటారు. ఆకోవలో వాడే కానిస్టేబుల్- 982 డి. శ్రీనివాసు. మనం హ్యాపీగా ఉంటున్నామంటే గుట్టుచప్పుడు కాకుండా పనిచేసుకుపోయే ఇలాంటి వాళ్లే కారణం.
కృష్ణాజిల్లా- మచిలీపట్నం: హనుమాన్ జంక్షన్ కూడలి వద్ద నిరంతరం వాహన రాకపోకలతో రద్దీగా ఉంటుంది.అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది మాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీగా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడి స్తంభించిపోయే అవకాశం ఉన్న ప్రాంతం.
హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్- 982 డి. శ్రీనివాసు 25.09.2020 వ తేదీ సాయంత్రం జంక్షన్ కూడలి వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో, అనుకోకుండా ఒక్కసారిగా వర్షం ప్రారంభం కావడంతో, ఏమాత్రం వెను తిరగకుండా జోరు వానలో తడుస్తూనే వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించాడు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరువాన, క్షణం ఆలస్యం చేస్తే భారీగా నిలిచిపోయే ట్రాఫిక్, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విధినిర్వహణలో నిమగ్నమై కానిస్టేబుల్ చూపిన చొరవ కు పై దకాా వెళ్లింది. రాష్ట్ర హోం శాఖ మాత్యులు మేకతోటి సుచరిత , రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ సామాజిక మాధ్యమం వేదికగా కానిస్టేబుల్ యొక్క సేవకు అభినందనలు తెలుపారు.
ఈ రోజు జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు జిల్లా పోలీసు కార్యాలయం లో దుశ్శాలువతో సత్కరించి తను చేసిన సేవకు ప్రోత్సాహకంగా నగదు రివార్డును అందజేసి అభినందనలు తెలిపారు.