గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి విజయవాడ ధనేకుల ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న సెకండ్ సెషన్ పరీక్షా కేంద్రాన్నికృష్ణజిల్లా కలెక్టర ఎ. ఎం డి ఇంతియాజ్,జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) కె.మోహన్ కుమార్లు సంయుక్తంగా సందర్శించారు.
ఈ సెంటర్ లో 1008 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. ఇందులో ఒకరు కోవిడ్ బాధితురాలు. ఆమె కు ప్రత్యకంగా గది కేటాయించినట్లు నిర్వాహకులు కలెక్టర్ కు తెలిపారు. అనంతరం ఆయన పరీక్ష గదులన్నింటిని పరిశీలించారు.