హైదరాాబాద్ నాలా 12 సం. పాపను మింగేసింది… నేరెడ్ మెట్ లో విషాదం

హైదరాబాద్  నేరెడ్‌ మెట్‌ కాకతీయ నగర్‌ లో నిన్న అదృశ్యమైన చిన్నారి సుమేధ కపురియా(12) శవమై కనిపించింది. నిన్న సాయత్రం ఆడుకునేందుకు సైకిల్ తీసుకొని బయటకు వెళ్లి ఎంతకీ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. ఓ నాలా వద్ద బాలిక సైకిల్ కనిపించగా , సుమేదా దానిలో పడి ఉంటుందని భావించారు.ఈ రోజు బండ చెరువు దగ్గర చిన్నారి మృతదేహం లభించింది.

దీన్ దయాల్ నగర్ లో నివసించే అభిజిత్ కాపురియా మరియు సుకన్యా కాపురియా కుమార్తె సుమేధా కపూరియా (12) నిన్న సాయంత్రం సుమారు 6.30సమయంలో ఆడుకోడానికి వెళ్లి అదృశ్యమయ్యారు.  ఇంటి నుంచి బయటకి వెళ్లిన కూతురు ఇంటికి రాకపోవడంతో  తల్లితండ్రులు  ఆ ప్రాంతమంతా వెదికారు. పాప అచూకి  దొరకకపోవడంతో తల్లిదండ్రులు నేరేడ్మేట్ పోలిసిలకు ఫిర్యాదు చేసారు . పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నేరేడ్మేట్ పోలీసులకు ఈ ఉదయం నాలాలో బాలిక సైకిల్ దొరకడంతో ప్రమాదశాతువు బాలిక నాలాలో పడిందేమో అని పోలీసులు అనుమానం వచ్చింది. దీనితో ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు .

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాగిన ఈ గాలింపూలో బాలిక సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బండ చెరువులో శివంగా మారి తేలింది .
నాలాలు మూయకుండా, ఎలాంటి కంచెలు ఏర్పాటు చేయకుండా వదిలేసిన అధికారుల తప్పిదమే లేక నాలాలపై ఇంటి నిర్మాణాలు చేస్తుంటే లంచం తీసుకుని కళ్ళు మూసుకున్న టౌన్ ప్లానింగ్ అధికారుల తప్పిదమో లేక ప్రక్రుతి వైఫల్యమే తెలియదు కానీ ఓపెన్ నాలా ఒక నిండు ప్రాణాన్ని బాలి తీసుకుంది. నాలాలపై దర్జాగా ఇళ్ళు నిర్మించుకున్న ప్రజలు ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉల్లిక్కి పడ్డారు . బండ చెరువులో శవంగా తేలిన సుమేధా కపూరియా (12) మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒస్మానియా హాస్పటల్ కి తరలించారు .
బాలిక అదృశ్యం విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావ్ సంఘటనా స్థలానికి చేరుకోగా ఆయనకి చేదు అనుభవం ఎదురైంది . ఎమ్మెల్యే మరియు స్థానికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది . వర్షం పడితే చాలు మోకాలు లోతు నీళ్లు రోడ్లపైకి వస్తాయని స్థానికులు మైనంపల్లిపై మండి పడ్డారు . కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు వస్తారని ఆవేదన వ్యక్తం చేశారు . దీనిపై స్పందిస్తూ మైనంపల్లి స్థానిక మహిళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరారు . రానున్న వర్షా కాలం లోగా మల్కాజిగిరి లో ఓపెన్ నాలాల సమస్య లేకుండా చేస్తానని లేని పరిస్థితిలో తానూ నాలాలో దూకి చచ్చిపోతానని ఆవేదంగా వాగ్దానం చేశారు .