ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
అమరావతి భూ కుంభకోణంలో అభియోగాలు రావడంతో శ్రీనివాస్‌పై ప్రివెన్షన్ కరెప్షన్ 409, ఐపీసీ 420 రెడ్ విత్ 120-B సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాక ఒక ప్రకటన విడుదల చేసింది.
దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు మరో 12మందిపై కేసు నమోదుచేశారు. చంద్రబాబు హయాంలో అడ్వొకేట్ జనరల్‌గా ఉన్న దమ్మాలపాటి అధికారిక హోదాలో ఉంటూ అక్రమాలకు పాల్పడ్డట్టు సాక్ష్యాధారాలున్నాయని ఎసిబి పేర్కొంది.2014లో మామ, బావమరిది పేర్లతో భూములు కొన్నారని,తర్వాత 2015, 2016లో అవే భూములు దమ్మాలపాటికి బదలాయింపు జరిగిందని ఆరోపణ.
CRDA కోర్ క్యాపిటల్ పరిధిలో ఉండేలా కొనుగోలు చేసిన దమ్మాలపాటి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండడంతో కేసు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది.