తిరుపతిలో భూబకాసురులు, కొందరు పోలీసు, రెవిన్యూ అధికారుల అండ: నవీన్ కుమార్ రెడ్డి

తిరుపతిలోని కొంతమంది అవినీతి పోలీసు అధికారులు, రెవిన్యూ అధికారులు పవిత్ర ప్రదేశమయిన తిరుపతిలో భూకబ్జాలను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, ఐఎన్ టియుసి నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి తీవ్రమయిన ఆరోపణ చేశారు.
ఈ అధికారుల వల్ల భూబకాసురలు చెల ేగిపోతున్నారని, వారి భరతం పెట్టాలని ఆయన పిలపునిచ్చారు. భూభకాసురులతో పేరుతో తమ కులం వాళ్ల జోలికి వస్తే సహంచమని మరొ కొంతమంది ప్రకటించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
తిరుపతి ప్రజలు భయపడే పరిస్థితిని భబకాసురులు సృష్టించారని భూకబ్జాదారులను ప్రోత్సహిస్తున్నఅధికారుల మీద చర్యలు తీసుకోంండని ఆయన ముఖ్యమంత్రి కి ఆయన విజ్ఞప్తి చేశారు.
కొంతమంది పెద్దలుగా చలామణి అవుతున్నవారు ప్రభుత్వం అండదండలున్నాయని ఈ భూకబ్జాలకు పాల్పడుతున్నారని, వీరి మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ రోజు ఆయన వెల్లడించిన విషయాల వీడియో

1) తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం ఇక్కడ జన్మించడం,నివసించడం పూర్వజన్మసుకృతం!!
2) తిరుపతి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత నగరంలోని అన్నీ వర్గాల ప్రజలపై ఉంది!!
3) తిరుపతి స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి వ్యాపార,ఉద్యోగాల,పిల్లల చదువుల నిమిత్తం ఇక్కడ స్థిరపడిన అన్ని కులాల మతాలవారు సంతోషంగా ఐక్యమత్యంతో ఉమ్మడి కుటుంబ సభ్యులులా జీవనం సాగిస్తున్నారు!!
4) “తిరుపతి ప్రజల సహనాన్ని చేతగానితనంగా చూడకండి” నగరంలో ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా ఐకమత్యంతో ప్రతిఘటించాలి
“చట్టం ఎవరికీ చుట్టం కాదు” ప్రజలు తిరగబడితే ఆపడం ఎవరి తరం కాదు అన్న విషయాన్ని అవినీతి అధికారులు,భూ కబ్జాదారులు గుర్తించాలి!!
5) తిరుపతి రేణిగుంట రోడ్డులో జరిగిన స్థల వివాదానికి సంబంధించి కొంతమంది మా కులానికి సంబంధించిన వారి భూముల జోలికి వస్తే ఎదుర్కొంటామని “అఖిలపక్ష కుల సంఘం” ప్రకటించడం సోషల్ మీడియాలో పెట్టడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం!!
6) తిరుపతి నగరంలో అక్రమంగా అన్యాయంగా ఏ కులానికి సంబంధించిన వ్యక్తుల ఆస్తులపై దాడులు దౌర్జన్యాలు జరిగినా కులమతాలకు అతీతంగా నగర ప్రజలంతా ఐక్యమత్యంతో ఎదుర్కొంటాం అని హెచ్చరిస్తున్నాను!!
7) తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాలలో భూముల ధరలు పెరగడంతో ప్రభుత్వ రెవెన్యూ,దేవాదాయ శాఖ భూములతో పాటు ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేసిన భూములను అంగ బలంతో ఆక్రమిస్తున్న “భూ కబ్జాదారులను ఉక్కుపాదంతో అణిచి వేయాల్సిన” బాధ్యత ప్రభుత్వంపై ఉంది!!
8) తిరుపతి నగరంలో కొంతమంది అవినీతి పోలీస్, రెవెన్యూ అధికారుల కారణంగా ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోంది!!
9) రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అండదండలు మెండుగా ఉన్నాయి అన్న ధీమాతో భూకబ్జాదారులులను కొంత మంది అవినీతి అధికారులు పెంచి పోషించడం పై రాష్ట్ర ముఖ్యమంత్రి నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకొని శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి!!
10) తిరుపతి శాసనసభ్యులు, జిల్లా పోలీసు ఉన్నతాధికారి నగరంలో ఎంతటి వారైనా ఏ పార్టీ వారైనా ఆక్రమణలకు దౌర్జన్యాలకు పాల్పడితే చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే బహిరంగంగా పత్రికాముఖంగా సోషల్ మీడియా ద్వారా హెచ్చరించడం శుభపరిణామం!!