గూడూరులో టోటల్ లాక్ డౌన్ ఇలా అమలుచేస్తున్నారు

నెల్లూరు జిల్లా కలెక్టర్  ఎన్ వి చక్రధర్ బాబు ఆదేశాల మేరకు జిల్లాలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గూడూరు పట్టణంలో  కూడా పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీనికో గూడూరు టవర్ క్లాక్ సెంటర్ లో వన్ టౌన్ ఎస్సై సైదులు తన సిబ్బందితో లాక్ డౌన్ ని అమలు అమలు పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు ఉదయం 6 గం నుండి రేపు ఉదయం 6 వరకు ఎటువంటి దుకాణాలు తెరవకుండా గుడూరులో నిషేధం ఉంది.