కరోనా వ్యాప్తి నివారించేందుకు టిటిడి శ్రీవారి దర్శనాలను ఆపేయాలని ప్రజలంతా కోరినపుడు ఖాతరుచేయలేదు. అయితే, ఉన్నట్లుండి నిన్న టిటిడి కరోనా పేరు చెప్పి సర్వదర్శనాలను రద్దు చేసింది.
సెప్టెంబర్ 30 దాకా దర్శనాలుండవని అకస్మాత్తుగా ప్రకటించడం చాలా బాధకరమని, ఇది వేలాది మంది సాధారణ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమేనని విమర్శలు వినవస్తున్నాయి.
సర్వదర్శనానికి వచ్చేది సామాన్యన ప్రజలు, వాళ్లు రకరకాల కష్టాలు ఎదుర్కొని తిరుమలకు వస్తారు. అలాంటి వారిని మనోభాావాలు లెక్కచేయకుండా కూడా కరోనా తగ్గించేందుకు అని చెప్పి సర్వదర్శనం రద్దు చేశారు. సాధారణ ప్రజలను ఆపేస్తే కరోనా తగ్గుతుందా? సర్వదర్శనానికి వచ్చే ప్రజల వల్ల కరోనా వ్యాపిస్తున్నందా? ఏమనుకోవాలి.
కేవలం విఐపిల భద్రతకోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీనాయకుడు, రాయలసీమ యాక్టివిస్టు నవీన్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
తిరుమల శ్రీవారి భక్తుల హక్కుల మీద ఎపుడూ గళంవిప్పే నవీన్ కుమార్ రెడ్డి* సర్వదర్శనాన్ని సెప్టెంబర్ 30 దాకావాయిదా వేయడానికి అభ్యంతరంచెబుతున్నారు. ఆయనే మంటున్నారో వినండి.
1) టిటిడి అధికారుల తొందరపాటు నిర్ణయాల కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి,ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోంది!!
2) టీటీడీ ఇచ్చిన పత్రికా ప్రకటనలో తిరుమల కొండపై కోవిడ్ ఇన్ఫెక్షన్ ను అరికట్టేందుకు శ్రీవారి సర్వ దర్శనం టైం స్లాట్ దర్శనాలను సెప్టెంబర్ 30 వరకు నిలుపుదల చేస్తున్నాం అని ప్రకటించారు సరే!!…మరి
3) తిరుమలకు సర్వ దర్శనం టైం స్లాట్ సామాన్య భక్తులు ఎక్కువగా వస్తే కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుందా?? మరి శ్రీ వాణి ట్రస్ట్ టికెట్లు అలాగే ప్రముఖుల సిఫార్సు లేఖలు తెచ్చే విఐపి భక్తుల ద్వారా తిరుమల కొండపై కొవిడ్ ఇన్ఫెక్షన్ రాధా?? తిరుమలలో కోవిడ్ ఇన్ఫెక్షన్ పూర్తిగా అరికట్టాలంటే అన్ని దర్శనాలకు సేవలకు భక్తులను అనుమతించడం పూర్తిగా రద్దు చేస్తారా??
4) టీటీడీ అధికారులు టికెట్ల జారీ విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారా??చైర్మన్, స్థానిక బోర్డు సభ్యుల ఆలోచనలను పరిగణలోకి తీసుకోవడం లేదా అన్న అనుమానాలు శ్రీవారి భక్తులలో కలుగుతున్నాయి!!
5) తిరుపతిలో కరోనా కేసుల పెరుగుదల గురించి నగరపాలక సంస్థ,పోలీస్ ఉన్నతాధికారుల నుంచి వాస్తవ సమాచారం తీసుకొని సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా తిరుమల అధికారి దర్శనాల పై నిర్ణయాలు తీసుకోవడం వెంటనే ఉన్నఫలంగా రద్దు చేయడం సామాన్య భక్తుల మనోభావాలను కించపరచడం కాదా!!
6) కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో సర్వ దర్శనం టైం స్లాట్ టోకెన్లను విడుదల చేయడం ఎందుకు తిరిగి వెంటనే రద్దు చేయడం ఎందుకు!!
7) శ్రీవారి దర్శనార్థం పెరటాసి మాసంలో సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన బస్సులలో రైలు మార్గాన తిరుపతికి చేరుకొని భూదేవి కాంప్లెక్స్ లో దర్శనం టోకెన్ల కోసం పడిగాపులు పడుతున్న భక్తులకు టిటిడి క్షమాపణ చెప్పాలి.
(*నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, ఐఎన్టీయుసి జిల్లా గౌరవ అధ్యక్షులువీన్ కుమార్ )