కరీంనగర్ లోక్ సభ్యుడు, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చాలా ఆసక్తి కరమయిన విషయాలు వెల్లడించారు. ఆయన ఈ రోజు పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ కు కోవిడ్ క్షమా భిక్ష పెట్టిందని, లేకుంటే ఆయన సంగతేంటో బయటపడేదని అన్నారు.
పార్టీ చాలా మంది నేతలకు కెసిఆర్ నియంతృత్వ ధోరణి నచ్చడం లేదని, వారంతా బిజెపిలో చేేేరేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన ట్వీట్ చేశారు. ఎందుకు చేరడంలేదో, ఎపుడో చేరతారో ఆయన వెల్లడించలేదు.
ఎన్నిలకపుడు ఆయన చాలా హామీలు చేశారని, తీరా ఎన్నికలయిపోయి గెల్చాక వాటిని గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు.
👉 కోవిడ్ కేసీఆర్ కు భిక్ష పెట్టింది..లేకుంటే కేసీఆర్ సంగతేందో బయటపడేది..
👉 కేసీఆర్ నియంతృత్వ వైఖరి నచ్చక ఎంతో మంది టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.
👉 ఎన్నికల వేళ ఎన్నో హామీలు గుప్పించిన కేసీఆర్ గెలిపించిన తర్వాత పట్టించుకోలేదు. pic.twitter.com/Oyba3ysxoI
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 6, 2020