తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలోని కల్యాణోత్సవ రథం దగ్ధం అయింది.
శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. షెడ్డులో భద్రంగా ఉన్న రథానికి మంటలు అంటుకున్నాయి. ఫలితంగా పూర్తిగా దగ్ధం అయింది. షెడ్డులో ఉన్న రథానికి మంటలు ఎలా అంటుకున్నాయనేది ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం లేదు. మరి రథానికి మంటలు అంటుకోవడంమేమిటి. ఏ ప్రమాదవశాత్తు ఇది జరిగింది? లేద ఎవరయినా ఆకతాయిల ఈ పనిచేశారా అనేది తేలాల్సిఉంది.
ఈ ఘటన పై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అంతర్వేది క్షేత్రం కాకినాడకు 130కిమీ దూరాన, రాజమండ్రికి 100కి.మీ దూరాన ఉంటుంది. ఇక్కడ కొలవై ఉన్ దేవుడు లక్ష్మీనరసింహుడు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య మయిన పుణ్యక్షేత్రాలలో అంతర్వేది ఒకటి.
సుమారు 40 అడుగులు ఉన్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో ఇది చాలా పాపులర్. సుమారు లక్షమంది దాకా ఈ రధోత్సవానికి హాజరవుతారు. ఈ దర్ఘటన మీద దేవాదాయ మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. దర్యాప్తుచేయాలని దేవాదాయ శాఖ ఆదనపు కమిషనర్ రా మచంద్రమోహన్ ను ఆదేశించారు.