పార్లమెంటులో క్వశ్చన్ అవర్ రద్దు పై నిరసన… ఇంతకీ క్వశ్చన్ అవర్ గొప్ప ఏమిటి?

పార్లమెంటు తొందర్లో జరుగనున్న పార్లమెంటు సమావేశాలలో ప్రశ్నోత్తరాల సమయాన్ని (question hour) రద్దు చేశారు.  కోవిడ్ కారణంగా  ప్రభుత్వ అభ్యర్థన మేరకు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసినట్లు లోక్ సభ నోటిపికేషన్ విడుదల చేసింది. ఇదే విధంగా ప్రయివేటు మెంబర్స్ బిజినెస్ చేపట్టేందుకు ఒక దినాన్ని కూడా ఖరారు చేయలేదు,’ లోక్ సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పార్లమెంటు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 దాకా సమావేశం కానుంది.
“ There will be no Question Hour during the session. In view of the request of the Government owing to the prevailing extraordinary situation due to COVID-19, the speaker has directed that no day be fixed for the transaction of Private Members’ Business during the session.” అనినోటి ఫికేషన్ లో పేర్కొన్నారు.
దీనితో ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహించాయి. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్ద చేయడమేమిటి, దేశ ఆర్థిక వ్యవస్థ, కరోనా నియంత్రణ లలో ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రతిపక్షపార్టీలు ప్రశ్నించకుండా చేసేందుకే ఇలా చేశారని వఈ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ లకు ఉన్న ప్రశ్నించే హక్కును కాల రాయడమే ఇది ఈ పార్టీలు విమర్శిస్తున్నాయి. పాండెమిక్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది.
పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయం ఒక గంట సేపు ఉంటుంది. ఒక గంట కాలాన్ని రద్దు చేసినందుకు ప్రతిపక్ష పార్టీలకు ఇంత ఆగ్రహం రావడానకి కారణమేమిటి? ప్రశ్నోత్తరాల సమయానికి ప్రాముఖ్యం ఏమిటి?
ప్రశ్నోత్తరాల సమయం (Question Hour)
సమావేశాలపుడు  ప్రతి రోజు పార్లమెంటు ఉదయం పదకొండు గంటలకు సమావేశమవుతుంది.అ పుడు పదకొండు గంటలనుంచి  పన్నెండు గంటల మధ్య ఉన్న గంట కాలాన్ని Rules of Procedure and Conduct of Business in Lok Sabha లోని 32 వ రూల్ ప్రకారం ప్రశ్నోత్తరాల గంట గా ప్రకటించారు. ఈగంట వ్యవధిలో సభ్యులు ప్రభుత్వాన్ని ప్రజాసంబంధమయిన అంశాలమీద ప్రశ్నించి వచ్చు. దీనికి మంత్రులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర ప్రతి పసంగించే రోజున, ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టేరోజున మాత్రం ప్రశ్నోత్తరాల సమయం ఉండదు.  మిగతా రోజులో క్వశ్చన్ అవర్ తప్పని సరి.
బ్రిటిష్ పార్లమెంటులో  క్వశ్చన్ టైం
మనం క్వశ్చన్ అవర్ ని బ్రిటిష్ పార్లమెంటులో క్వశ్చన్ టైం అంటారు. అక్కడ ఇది సోమవార నుంచి గురువారం దాకే అందుబాటులో ఉంటుంది.  సభలో ప్రాథమిక వ్యవహారాలు, ప్రవేటు బిజినెస్ అయిపోయాక క్వశ్చన్ అవర్ ఉంటుంది. ప్రతి బుధవారం నాడు కామన్స్ లో మధ్యాహ్నం 12 నుంచి 12.30 దాకా సభ్యులప్రశ్నలకు ప్రధాన మంత్రి సమాధానమిస్తారు. భారతదేశంలో ఈ సంప్రదాయం లేదు.
ప్రశోత్తరాల సమయం ఎలా మొదలవుతుంది?
ఆ రోజు కు ఎంపిక చేసిన ప్రశ్నలకు నెంబర్ ఉంటుంది. సభ ప్రారంభం కాగానే స్పీకర్  క్వశ్చన్ ప్లీజ్ అంటారు. అపుడు  మొ మొదటి పశ్న వేసిన సభ్యుడు తన ప్రశ్నను చదవకుండా పశ్న నెంబర్ మాత్రం చదువుతాడు. తర్వాత దానికి  సంబంధించిన మంత్రి సమాధానం రాతపూర్వకంగా సప్లయి చేస్తారు. లేదా మౌఖికంగా చెబుతారు. అపుడు మంత్రి సమాధానం మీద సభ్యుడు, అతనితో పాటు అనుబంధ ప్రశ్నలు పంపించిన ఇతర సభ్యులు అనుబంధ ప్రశ్నలడగవచ్చు.
ప్రశ్నలంటే ఏమిటి?
రూల్ ప్రకారం, అత్యవరసమయిన అంశాల మీద ప్రభుత్వం నుంచి సమాచారం రాబట్టేందుకు సభ్యులు చేసే అభ్యర్థనే పార్లమెంటరీ క్వశ్చన్. పార్లమెంటులో సభ్యులకు అందుబాటులో ఉన్న చాలా శక్తివంతమయిన సాధనమిది.  సభలో నిలబడి, సభ్యుడు అడిగిన ప్రశకు అధికారికంగా ఇచ్చే సమాచారం కాటట్టి దీనికి చాలా ప్రాముఖ్యం ఉంటుంది.అంతేకాదు, ఈ ప్రశ్న ద్వారా మంత్రులను , ప్రభుత్వాన్ని కూడా  ఇరుకు పెట్టవచ్చు. పార్లమెంటులో సభలోల మంత్రి ఇచ్చే సమాధానం  ఒకటి రెండు అనుబంధ ప్రశ్నలు కూడా వేసే అధికారం సభ్యుడికి ఉంటుంది.అంతేకాదు, ఇతర సభ్యులు కూడా ఈ ప్రశ్న సంబంధమున్న అనుబంధ ప్రశ్నలను వేయవచ్చు. ఇలా అనేక మంది సభ్యలు తోడయినపుడు వారంతా అడిగే ప్రశ్నలకు మంత్రి ఇరుకున పడతాడు.అందుకే మంత్రి తన శాఖ కు సంబంధించినప్రశ ఉన్నపుడు  బాగా ప్రిపేరయి వస్తారు. సభ్యుల నుంచి ఎలాంటి అనుబంధ ప్రశ్నలు రావచ్చో ముందే వూహించుకుని వాటికి సమాచారం సేకరించుకుని వస్తుంటారు. పార్లమెంటు సమావేశాలపుడు మంత్రులు అక్షరాలు విద్యార్జులు పరీక్షలకు ప్రిపేయిరనట్లే ప్రిపేరవుతారు. ఈ ప్రశ్నల వల్లే చాలా కుంభకోణాలు బయటపడ్డాయి. ఏలాంటి అనుబంధ ప్రశ్న వస్తుందోననే టెన్షన్ మంత్రులలో ఉంటుంది. ఇది లైవ్ ప్రసారం ఉంటుంది కాబట్టి సభ్యులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. మంత్రి సమాధానం నచ్చక పోతే బాగా గొడవచేస్తారు.అది లైవ్ అంతా చూస్తారు. మంత్రి, సభ్యులు పనితీరును అంచావేసేందుకు ఈ క్వశ్చన్ అవర్ బాగా ఉపయోగపడుతుంది. క్వశ్చన్ అవర్ లో విఫలమయిన మంత్రికి ఫ్యూచర్ ఉండదు.
అందుకే ప్రశ్నోత్తరాల సమయం ప్రతిపక్షానికి ఒక ఆయుధంగా, ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంటుంది.  ఈకారణంచేతనే బుధవారం నాడు ప్రశ్నోత్తరాల సమయాన్ని స్పీకర్ రద్దు చేసినందుకు నిరసన వస్తున్నది. ఎందుకంటే ప్రతిపక్షాలు ఈ ప్రశ్నోత్తరాల సమయం కోసం ఎదురుచూస్తూంటాయి. ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తూ ఉంటుంది. 1991లో ప్రత్యక్షప్రసారాలు మొదలయ్యాక ఈ గంట ప్రాముఖ్యం బాగా పెరిగింది.
లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయం 1952 నుంచి కొనసాగుతూ ఉంది. అయితే, రాజ్యసభలో ఈ సంప్రదాయం 1964 నుంచి మాత్రమే మొదలయింది. అంతకు ముందు రాజ్యసభలో మొదట వారానికి రెండురోజలు, తర్వాత నాగులు రోజులుగా ఉండింది.
లోక్ సభ ప్రారంభమయినప్పటి నుంచి ఇప్పటి దాకా సుమారు 15వేల ప్రశ్నలను సభ్యులు అడిగారు
1962లో చైనా యుద్ధ సమయంలో పార్లమెంటు సమావేశాలు మధ్యామ్నం పన్నెండు గంటలకు మొదలయ్యేవి. అందువల్ల క్వశ్చన్ అవర్ రద్దు అయింది.అపుడు రూలింగ్, ప్రతిపక్ష పార్టీలు అంగీకారానికి వచ్చి రద్దు చేశాయి. ఇపుడు కరోనా పేరుతో ప్రభుత్వ అభ్యర్థన మేరకు  రద్దు చేస్తున్నారు.అందుకే ప్రతిపక్షం గొడవచేస్తూ ఉంది.
ప్రశ్నలెన్ని రకాలు?
పార్లమెంటులో సభ్యులు అడిగే ప్రశ్నలు రెండు రకాలు. 1. నక్షత్ర ప్రశ్నలు (starred questions) 2.నక్షత్ర గుర్తులేని ప్రశ్నలు (unstarred question). ఇందులో స్టార్డ్ ప్రశ్నలంటే సభలోనే మంత్రి స్వయంగా సమధానాలు చెప్పే ప్రశ్నలు. అపుడు సభ్యుడు ఆ స మాధానం నచ్చకపోతే, అనుబంధ ప్రశ్న వేసిప్రశ్నించవచ్చు. అన్ స్టార్డ్  క్వశ్చన్ అంటే సభ్యుడికి మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇంటికి పంపిస్తారు. ఇచ్చిన సమాధానంతో  సభ్యుడు సంతృప్తి పడాలి.
ఒక్కొక్క రోజు సభలో సభలో 20 స్టార్డ్ క్వశ్చన్స్ మాత్రమే చర్చకు వస్తాయి. సభ్యులందరు వేసిన స్టార్డ్ ప్రశ్నలనుంచి లాటరీ తీసి ఈ  ఇరవైని ఎంపిక చేస్తారు. ఈ ప్రశ్నలను ఆకుపచ్చ కాగితాల మీద ప్రింట్ చేసి సభ్యులకు ముందే అందిస్తారు. తమ ప్రశ్న స్టార్డ్ గా ఉండాలా, అన్ స్టార్డ్ గా ఉండాలనేది సభ్యుడి ఇష్టం. ఆయన ప్రశ్నదగ్గిరే అది  స్టార్ గుర్తు వేయవచ్చు. ఏకారణం చేతనైన ఏదైనా ఒక రోజు ఈ 20 ప్రశ్నలు చర్చకు రాకపోతే, వాటిని అన్ట స్టార్డ్ గ గుర్తించి సమాధానాలు ఇంటికి పంపిస్తారు. సభ్యలు ప్రశ్నలను కనీసం 15 రోజుల ముందు లోక్ సభ లేదా రాజ్యసభ కార్యాలయాలకు పంపించాలి. ప్రశ్నలు సూటిగా ఉండాలి. 150పదాలు మించకుండా ఉండాలి.
ఇక స్టార్డ్ ప్రశ్నల విషయానికి వస్తే, రోజూ అన్నిశాఖ లనుంచి 230ప్రశ్నలను ఈ క్యాటగిరి కింద గుర్తించి వాటికి మంత్రుల సమాధానాలు జత చేసి పంపిస్తారు.  అన్ స్టార్డ్ ప్రశ్నలను కూడా సభ్యులు 15 రోజుల ముందు అందించాలి. ఈప్రశ్నలను తెల్లకాగితాల మీద ముద్రిస్తారు.
స్వల్ప వ్యవధి ప్రశ్నలు (short notice question)
ఇది మూడో రకం ప్రశ్న. ఇది ఏమర్జన్సీ వచ్చినపుడు సభ్యులు వేయాలనుకునే ప్రశ్నల కోసం ఈ  అవకాశం కల్పించారు. పార్లమెంటరీ రూల్ 54 కిందఈ ఏర్పాటుచేశారు.   దీనికి రెండు మూడు రోజులలో  నోటీసు ఇవచ్చు. ప్రశ్నలను పింక్ రంగు పేపర్ల మీద ముద్రించి సభ్యులకు అందిస్తారు.
 ప్రతిసభ్యుడు సమావేశాలలో ప్రతిరోజు స్టార్డ్, అన్ స్టార్డ్ కలసి  పది ప్రశ్నలకు పంపించవచ్చు. ఇందులో నుంచి  రెండురకాలు కలిపి అయిదు ప్రశ్నలను ఎంపికచేస్తారు. ప్రతి సభ్యుడి నుంచి ఒక స్టార్డ్ ప్రశ్నను మంత్రి  మౌఖిక సమాధానం కోసం ఎంపిక చేస్తారు. ఏదేని ప్రశ్నను ఒక్కొక్కసారి వాయిదా వేసిన పుడు  ఆరోజు ఆ సభ్యుడికి ఒకటి కంటే ఎక్కువ ప్రశ్నలుండవచ్చు.
ప్రశ్నలను ఎవరు ఎంపిక చేస్తారు?
ప్రశ్నలకు ఎంపిక చేసేందుకు కూడా పార్లమెంటులో నియమాలున్నాయి. ప్రశ్నకు అనుమతించవచ్చా లేదా అని నిర్ణయించే అధికారం స్పీకర్ కు ఉంటుంది. ప్రశ్న దురుద్దేశంతో కూడుకున్నదని లేదా ఇది సభ్యుడి తన హక్కును దుర్వినియోగపరుస్తున్నాడని స్పీకర్ భావిస్తే ఆ ప్రశ్నకు అనుమతి నిరాకరించవచ్చు.
ఈ కారణాల చేత పార్లమెంటు సభలు ఫుల్ బెంచ్ కనిపించేది ప్రశోత్తరాల సమయంలోనే. ఎందుకంటే, ఒక్కొక్కసారి  మరొక సభ్యుడు వేసిన ప్రశ్న ముఖ్యమయినదయితే, ఇతర సభ్యులు ముందుగా నోటీసు ఇవ్వకపోయినా చెయ్యి ఎత్తి  స్పీకర్ అనుమతి కోరి, మంత్రికి ప్రశ్న వేయవచ్చు.
ఒక్కొక్క సారి ఈ ప్రశ్నలతో ప్రభుత్వం ఇరుకునపడిన సందర్భాలుకూడా ఉంటాయి. క్వశ్చన్ అవర్ లో సభ్యుడి ప్రశ్న చాలా శక్తి వంతమయిన ఆయుధం. ఒక్కొక్క సారి మౌఖిక సమాధానికి ఎంపిక అయిన ప్రశ్నలు ఇబ్బందికరమయినవి అయినపుడు  ఆ ప్రశ్నను ఉపసంహరించుకోవాలని, తన ఛేంబర్ కు వచ్చి మాట్లాడవచ్చని మంత్రులు సభ్యులను బతిమాలిని  సందర్భాలు కూడా ఉన్నాయి.

Like this stoyr? Share it with a friend?