నంద్యాల పెద్దాయన, మాజీ మాజీ ఎంపి, న్యాయవాది, నేషనల్ సీడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొజ్జా వెంకటరెడ్డి మనవడు బొజ్జా అర్జున్ రెడ్డి.
భారతదేశంలో ఉత్తమ 50 మంది లాయర్ల జాబితాను ఈ సంస్థ ప్రకటించింది.
ప్రపంచ ప్రసిద్ది గాంచిన థామ్సన్ రాయిటర్స్ యాజమాన్యంలోని ఆసియా లీగల్ బిజినెస్ (ALB) వ్యాపారాలు నిపుణుల కోసం మంచి అవగాహన కలిగిన సమాచారాన్ని అందించే సంస్థ ఇది.
అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ &రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి .
ఉస్మానియా యూనివర్సిటీ నందు BA.BL చేసిన బొజ్జా అర్జున్ ఆ తరువాత నెదర్లాండ్స్‌లోని హేగ్ అకాడమీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా నందు పబ్లిక్ & ప్రైవేటు ఇంటర్నేషనల్ లా ను 2009 లో చేశారు ఆస్ట్రియా దేశంలోని యూనివర్శిటీ ఆఫ్ వియన్నా నందు ఇంటర్నేషనల్, యూరోపియన్ బిజినెస్ లా (International and European Buisiness Laws) 2016 లో పూర్తిచేశారు.
భారతదేశంలో పలు ప్రసిధ్ద కంపెనీలకు న్యాయవాదిగా కొనసాగడమే గాక, అనేక ప్రజా సంబంధిత కేసులతో పాటు, రైతుల పక్షాన కూడా న్యాయవాదిగా తన సేవలు అందిస్తున్నారు.
బొజ్జా అర్జున్ రెడ్డి హైదరాబాదులో హైకోర్టు న్యాయవాదిగా ఉన్నారు.భారతదేశంలో ఉత్తమ న్యాయవాదిగా అతి పిన్న వయసులోనే ఎంపిక కాబడిన మన నంద్యాలకు చెందిన బొజ్జా అర్జున్ రెడ్డి రాయలసీమ సాగునీటి సాధన సమితి పూర్వక అభినందనలుతెలిపింది.
భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలన్నఅభిలాష వ్యక్తం చేసింది.