పార్లమెంటు క్వశ్చన్ అవర్ ను పునరుద్ధరించండి: 858 మంది మేధావులు విజ్ఞప్తి

సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో  లోక్ సభ, రాజ్యసభ లలో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయవద్దని వత్తిడి మొదలయింది.
కరోన కారణం చెప్పి ఈ పార్లమెంటు సమావేశాలనుంచి  ప్రశ్నోత్తరాల గంట (ఉదయం 11 నుంచి 12 దాకా)ని సస్పెండ్ చేస్తూ లోక్ సభ స్పీకర్ బుధవారంనాడు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదే విధంగా రాజ్యసభ కూడా నోటిఫై చేసింది. కరోనా కారణంగా ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు ప్రశ్నోత్తరాలసమయాన్ని రద్దు చేసినట్లు  లోక్ సభ సెక్రెటేరియట్ నోటిఫికేషన్ లో పేర్కొంది,
అయితే, ఈ రోజు  858 మంది మేధావులు (అద్యాపకులు, రాజకీయనాయకులు, విద్యార్థులు) లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు, రాజ్యసభ ఛెయిర్మన్, ఉప  రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
పార్లమెంటు సంప్రదాయాల ప్రకారం ఎపుడో చాలా అరుదైన సందర్బాలలో  మాత్రమే ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తారని ఈ అధికారాన్ని సభాధ్యక్షులు చాలా అరుదుగా ప్రయోగించారని వారు సభాపతులకు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. గతంలో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడమనేది  సభలు ఏకగ్రీవంగా అంగీకరించినపుడు మాత్రమే జరిగిదని అని  ఈ మేధావులు( Concerned Citizens) పేర్కొన్నారు.
 ఈ లేఖ మీద సంతకాలు చేసిన వారిలో మాజీ ఐఎఎస్ అధికారి జవహర్ సర్కార్, చరిత్రపరిశోధకులు మృదులా ముఖర్జీ ,అధ్యాపకులు జోయా హసన్, జయతి ఘోష్  లతో పాటు రాజకీయ నాయకుడు యానీ రాజా (సిపిఐ), హన్నన్ మోల్లా(సిపిఎం) ఆర్టీఐ యాక్టివిస్టు వెంకటేష్ నాయక్ తదితరులు ఉన్నారు.
గతంలో ప్రశ్నోత్తరాల సమయం రద్దయిన సందర్భాలు చాలా అరుదైనవని చెబుతూ అందులో 1962లో జరిగిన చైనా దురాక్రమణ ఒకటన పేర్కొన్నారు.  తర్వాత ప్రజాస్వామ్యానికి పరీక్షా సమయమనదగిన ఎమర్జీన్సీకాలం(1975-1976),  1990 నవంబర్ నుంచి 2008 జూలై లలో రెండు సార్లు విశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టినపుడు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారని  వారు చెప్పారు.
“ It may also interest you to note that the rare past precedents of exercise of this power to suspend question hour indicate that the exceptional circumstances included a session called following aggression by China (1962), a period when democracy itself was being tested (1976 and 1976) and when special sessions were called for the purpose of seeking a vote of confidence (Novembe 1990 and  July 2008)”  అని వారు లేఖలోపేర్కొన్నారు.
ఇపుడు దేశంలో ఉన్న కరోనా పరిస్థితి అసాధారణమయినదే అయినా, ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోయేందుకు దోహదపడే  చర్చా సమయమయిన ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసేందుకు కారణం కారాదని వారుపేర్నొన్నారు.
ఇదే సమయంలో వారు రాష్ట్రాల అనుభవాన్ని గుర్తు చేశారు. పాండెమిక్ సమయంలో సమావేశమయిన చాలా రాష్ట్రాల అసెంబ్లీలు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయని విషయాన్ని వారు స్పీకర్,  ఛెయిర్మన్ ల దృష్టికి తీసుకువచ్చారు.  ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయకుండా అసెంబ్లీ సాఫీగా నడిచేందుకు రాష్ట్రాలు చర్యలు తీసుకున్నపుడు పార్లమెంటు కూడా తప్పని సరిగా అలాగే చేయాలని కూడా వారు పేర్కొన్నారు.
“ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత అనేది ఎంతో మురిపమయిన ప్రజాస్వామిక ఆదర్శం. ముఖ్యంగా ప్రపంచమంతా పాండెమిక్ లో మగ్గుతున్నపుడు ఇద మీర విలువయినది. ప్రజల జీవితాలను కాపాండేందుకు అవసరమయిన నిర్ణయాలు తీసుకుకనేందుకు సరైన సమయంలో  కీలకమయిన సమాచారం అవసరం అవుతుంది. ఇపుడు సంక్షోభ సమయంలో ప్రజలలో భరోసా కల్పించేందుకు సభలో వేసే ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చే సమాధానాలు బాగాదోహదపడతాయి,” అని వారు పేర్కొన్నారు.
ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దుచేయడమే కాకుండా పార్లమెంటులో ఆ తర్వాత వచ్చే జీరో అవర్ (మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు) ని కుదించడం కూడా సరైందికాదని వారు అభిప్రాయపడ్డారు.
ఈసమయంలో సభ్యుల తమ తమ నియోజకవర్గాలకు సంబంధించిన అత్యవసర సమస్యలను లేవనెత్తతుంటారని దీనిని 30కుదించడం  సరికాదని వారు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి

పార్లమెంటులో క్వశ్చన్ అవర్ రద్దు పై నిరసన… ఇంతకీ క్వశ్చన్ అవర్ గొప్ప ఏమిటి?

 

Like this story? Share it with a friend!