ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు, వైసిపి ప్రభుత్వానికి మధ్య విబేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంతవరకు తొలిగించిన ఎన్నికల కమిషనర్ ను తిరిగినియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సముఖంగా లేకపోవడం వివాదం చెలరేగింది. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. చివరకు కోర్టు ఉత్తర్వులను గౌరవించకతప్పలేదు. ఇపుడు కమిషన్ వ్యవహారాలలో జోక్యం ఎక్కువయిందనే వివాదం మొదలయింది.ఈ విషయం మీద కమిషనర నిమ్మగడ్డ రమేష్ కుమారు కోర్టు ను ఆశ్రయించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల్లో ప్రభుత్వం జోక్యం ఎక్కువైందని, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి పై సీఐడీ నమోదు చేసి సతాయిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిషన్ చీఫ్ నిమ్మ గడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించాను.
కోర్టు విచారణ సోమవారానికి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సిబ్బంది మీద బనాయించిన కేసును కొట్టేయాలని ఆయన హైకోర్టును కోరారు.
★ వేధించడానికి కేసు నమోదు చేశారని, ఎన్నికల కమిషన్ విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని కమిషనర్ పేర్కొన్నారు.
★ రాష్ట్ర ఎన్నికల సహాయ కార్యదర్శి సాంబమూర్తి మరో పిటిషన్ దాఖలు చేశారు.
★ రెండు పిటిషన్ లను కలిపి సోమవారం విచారిస్తామని హైకోర్టు పేర్కొందది.
★ సాంబమూర్తి కంప్యూటర్ లోని డేటాను సీఐడీ తీసుకుందని పిటిషన్ లో పేర్కొన్న నిమ్మగడ్డ పేర్కొన్నారు.
★ ఎన్నికల కమిషన్ నుంచి సిఐడి తీసుకువెళ్లిన వస్తువులను ప్రభుత్వం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయనకోర్టు ను కోరారు.
★ సీఐడీ కేసు నమోదు చేసిన వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన కోరారు.
★ కేంద్ర హోంశా కార్యదర్శి రాష్ట్ర హోంశాల ముఖ్య కార్యదర్శి పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ సీఐడీ అదనపు డీజీ తదితరులను ప్రతివాదులుగా పిటిషన్ నిమ్మగడ్డ పేర్కొన్నారు.