పునరావాసం కల్పించి గోదావరి వరద బాధితులను ఆదుకోండి

తూర్పుగోదావరి జిల్లా పోలవరం ముంపు ప్రాంతాంలోకి వచ్చే  దేవిపట్నం మండల ప్రజలు గత వారం రోజులుగా వరదలతో అల్లాడి పోతున్నారు.

వారికి మంచినీరు ఇచ్చే నాధుడే కూడా లేడు. వరదల్లో చిక్కుకున్న ఈ గ్రామాల ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నా అధికారలెవరూ అక్కడ పర్యటడం లేదని ప్రజలు ఫిర్యాదు చేసిటన్లు జిల్లా సిపిఎం నేతలు విమర్శించారు.
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు)  నాయకులు వారం రోజులుగా వరద గ్రామంలో పర్యటించి అక్కడి ప్రజలను కష్టాలను స్వయనా పరిశీలించారు.
దేవిపట్నం మండలం వరద బాధితులను పరామర్శించాడానికి తమ బృందానికి అధికారులు అనుమతినీయకపోవడం ఇవ్వకపోవడంతో ఇలా అడవి గుండా వరద గ్రామాలకు వెళుతున్నసిపిఎం నాయకులు
వరదల్లో చిక్కుకుని ఇళ్లు మునిగిపోయి, తినడానికి తిండి, తాగటానికి నీళ్లూ లేవని, అయినా వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని  పార్టీ బృందం ప్రభుత్వన అధికారులను విమర్శించింది.
తక్షణం  అన్నీగ్రామలలో పునరావాం ప్యాకేజీ  ఇవ్వాలని, ఈ పని పూర్తయ్యే వారకు పోలవరం ప్రాజెక్టు పనులు ఆపాలని  ఈ బృందం డిమాండ్ చేసింది. ఇదే నినాదంతో  ప్రభుత్వ నికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది.
తెడ్ల అబ్బాయి, తూర్పో గోదావరి జిల్లా సిపిఎం నాయకుడు
 సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తెడ్లఅబ్బాయి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పోలవరం నిర్వాసితులను నిలువునా ముంచేయడానికే పూనుకుందని. అది ఈ వరదల సమయంలో స్పష్టంగ బయటపడిందనిఆరోపించారు.
అన్ని ఎన్నికల్లో జగన్ పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన హామీలని గోదావరిలో పడేశారని అబ్బాయి ప్రభుత్వని విమర్శించారు.
ఇప్పటికైనా,  దేవిపట్నం మండలం వరద బాధితులను ఆదుకునేందుకు  వరదనష్టపరిహారం పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు
ఈ పర్యటనలో నాయకులు సింగిరెడ్డి అచ్చరావు, కుంజం బాపన్నదొర మాట్లా వాణిశ్రీ, తీగల శ్రీనివాస్ పాల్గొన్నారు.