మొత్తానికి రాజా సింగ్ ను నిషేధించిన ఫేస్ బుక్

బాగా బురద పడ్డాక, పేస్ బుక్  హైదరాబాద్ గోషామహల్  బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను అన్ పబ్లిష్ చేసింది. అంటే అకౌంట్ ను మూసేంది.ఎన్ని రోజులో తెలియదు. ఈ విషయాన్ని రాజా సింగ్ స్వయంగా ట్విట్టర్ లోపేర్కొన్నారు.

Friends,

I’ve rec’d news through media that I’ve been banned by @Facebook for the so-called controversial speeches of mine

2018 https://t.co/EONGy7dnEP

2019https://t.co/LmPA6E528y

I’d like to clarify that I’ve not been using FB since April 2019

So, banning me makes no sense

— Raja Singh (@TigerRajaSingh) September 3, 2020

రాాజాసింగ్ పోస్టు ఎపుడూ సంచలనం, వివాదం సృష్టిస్తుంటాయి. ఆయన   పోస్టులు అవిఫేస్ బుక్ లో ఉన్నా,ట్విట్టర్ లో ఉన్నా  తీవ్రంగా ఉంటాయి. వాటికి అంతర్జాతీయ స్పందన ఉంటుంది. అయితే, చీటికి మాటికి సాధారణ ఫేస్ బుక్ అకౌంటు దారులను యువర్ పోస్టు గోస్ ఎగైన్స్ టు కమ్యూనిటీ స్టాండర్డ్స్ అంటూ నిషేధించే ఫేస్ బుక్ రాజాసింగ్ జోలికి ఎపుడూ వెళ్లలేదు. దీనికి కారణం ఎవరికీ తెలియదు ఈ మధ్య  అమెరికాకుచెందిన ఒక ప్రముఖ దిన పత్రిక ఈ గట్టు రట్టు చేసింది. భారతదేశంలో బిజెపిప్రభుత్వ ఉందని, దానితో తమకు పనులుంటాయని, అందువల్ల ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించకూడాదని  ఫేస్ బుక్ లో ఉన్న ప్రముఖు లు కొందరు యాజమన్యాన్ని ఒప్పించారు. ఇందులో ఈ వ్యాపార పాలసీలో భాగంగా బిజెపి అనుకూలురయిన రాజాసింగ్  పోస్టులను చూసీచూడనట్లు పోవాలని ఫేస్ బుక్ నిర్ణయించింది. దీని మీద చాలా చర్చ జరిగింది. వీటన్నింటిని అమెరికా పత్రిక బయటపెట్టింది. దీనితో ఫేస్ బుక్ భారతదేశంలో బాగా అభాసు పాలయింది. బిజెపికి సహకరిస్తూ ఉందని అనుమానం వచ్చింది.  ఫేస్ బుక్ రాజకీయం మీద దర్యాప్తు జరపాలనే డిమాండ్ వచ్చింది.
ఈ గొడవ తర్వాత ఫేస్ బుక్ రాజాసింగ్ అకౌంట్ ను అన్ పబ్లిష్ చేసింది.
 రెండురోజుల కింద ఇది జరిగిందని రాజాసింగ్ పేర్కొన్నారు.