కరోనా వ్యాపిస్తున్నపుడు కోవిడ్-19ని ఎదుర్కోవడమెలా?: డా.జతిన్ కుమార్ జాగ్రత్తలు (వీడియో)

కోవిడ్ 19 ను ఎదుర్కొనేందుకు చాలా ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఏది ఎపుడు ఎవరికి వాడాలనే విచక్షణ ఉండాలి. చాలా మందులు నిపుణులు చెబితేనే వాడాలి. ఇష్టమొచ్చినట్లు వీటిని వాడకూడదు. పేషంట్లు స్వయంగా ఏమందులు వాడరాదని డాక్టర్ ఎస్ జతిన్ కుమార్ (హైదరాబాద్) చెబుతున్నారు.
కోవిడ్ వచ్చాక అంతా సామాజిక బాధ్యత భుజానవేసుకుని డాక్టర్ లాగా సలహా లివ్వడం చేస్తున్నారు. కోవిడ్ జ్ఞానం లేని వాళ్లు, పల్లెటూరి డాక్టర్లు ఇలా మందులు ప్రిస్ర్కైబ్ చేస్తున్నారు.
వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలా మంది వాటిని అనుసరిస్తున్నారు. ప్రజలుకూడా మెడికల్ షాపుల కు వెళ్లి కొని మందులు వాడుతున్నారు. నిల్వ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ జతిన్ కుమార్ చేస్తున్నసూచనలు ఇవి: