తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం లోని అగ్రహారం ములపాడు గ్రామాల్లో ఈ విధంగా ఏజెన్సీ లో గిరిజనుల కష్టాలు ఇవి. వాళ్లిలా మకాం చెట్లమీదికి మార్చి తలదాచుకున్నారు.
కుటుంబాలు ఇళ్ల సామాన్లను మోసుకుని వూరోదలి పోవడం కష్టం కాబట్టి ఇలా చెట్ల మీద చేర్చి బురదలో,వరద నీళ్లలో ఈదుకుంటూ చుట్టుపక్కల్లో కోండల్లోకి వెళ్లి తలదాచుకుంటున్నారని ఎపి గిరిజన సంస్థ కార్యదర్వి తెడ్ల అబ్బాయి ‘ట్రెండింగ్ తెలుగు న్యూస్ ’కు చెప్పాడు.
ఇది జిల్లాలోని ఏజన్సీ ఏరియాలోని అనేక గ్రామాలలో పరిస్థితి. రోడ్లు మునిగిపోవడం వూర్లు ఖాళీ చేసినా ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో ఇలా గిరిజనులు ఇలా పెట్టేబేడతో సహా చెట్టుకొమ్మల మధ్య గుడారాలు వేసుకుని తలదాచుకున్నారని ాయన చెప్పారు. వాళ్లంతా వూర్లు ఖాళీ చేసేలా చేసేందుకు అధికారులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, పోలవరం ప్రాజక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుచేయకుండా ఖాళీ చేయమనడం అన్యాయమని రంపచోడవరానికి చెందిన అబ్బాయిపేర్కొన్నారు. అబ్బాయి జిల్లా సిపిఎం కమిటీ సభ్యుడు కూడా.
‘దేవీ పట్నం మండలంలో 32 గిరిజన గ్రామాలు ఇలా వరదమయమయ్యాయి. ఇవన్నీ కూడా పోలవరం ముంపు గ్రామాలు. వీళ్లందరికి పునరావాల కాలనీలు కట్టాల్సి ఉంది. ఇంక కట్టలేదు. ఇలాగే వాళ్లకి సరైన పరిహారం కూడా ఇవ్వలేదు. గత ఏడాది కొంత మొత్తం అందించారు. అదెందుకు చాలదు. అయినా సరే అధికారలు ఈ కొండరెడ్లు ఊర్లు ఖాళీ చేయాలనే ఉద్దేశంతో వారికి ఎలాంటి సహాయం అందించడంలేదు. అంతేకాదు, ఈ ప్రాంతాల్లోకిఎవరూ రాకుండా 144 వ సెక్షన్ విధించారు. మీడియాను కూడా అనుమతించడం లేదు. ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టలేదు.వాళ్ల దుస్థితిని ఎపి గిరిజన సంస్థ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో రెండు రోజులు కిందట కలెక్టర్ , ఆర్డీవో వచ్చి కొంత భత్యం అందించారు. అయితే, ఇతరలెవరూ ఈ గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు,’ అని అబ్బాయి తెలిపారు. తాను ఇతర కారకర్తలతో కలసి పోలీసులకు తెలియకుండా గిరిజనలను కలుపుకుని సాయం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.