మాజీ రాష్ట్రపతి భారతరత్న ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. కరోనా వల్ల ఢిల్లీ ఆర్మీ రీసెర్చ్ ఆండ్ రెఫరల్ (ARR) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దాదాపు పదిరోజుల పాటు పోరాడి ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
కొద్ది రోజుల కిందట ప్రణబ్ మెదడులో కణితి ఏర్పడటంతో ఆగస్టు 10 ఆసుపత్రిలో చేరారు.కణితికి శస్త్రచికిత్స జరిగింది. ఈ ఆపరేషన్ విజయవంతమయినా ప్రణబ్‌కు కూడా సోకడంతో పరిస్థితి విషమించింది.మూత్ర పిండాలు పనిచేయడం మానేశాయి.
ఆయన ఐసియులో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. ఒక గంట కిందట ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ చేశారు.
With a Heavy Heart , this is to inform you that my father Shri #PranabMukherjee has just passed away inspite of the best efforts of Doctors of RR Hospital & prayers ,duas & prarthanas from people throughout India !
I thank all of You 🙏— Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 31, 2020
ప్రణబ్ ముఖర్జీకి అసాధారణమయిన జ్ఞాపక శక్తి ఉంది. పార్లమెంటు సభల్లో మాట్లాడటపుడు చాలా సందర్భంగాలలో ఆయన తారీఖులు, గణాంకవివరాలు వెల్లడించి అధికార పార్టీని,మంత్రులను ఇరుకున పెట్టేవారు. అధికారంలో ఉన్నపుడు ఇదే జ్ఞాపకశక్తి కాంగ్రెస్ పార్టీకి కవచంగా పనిచేసేంది.
ఒకసారి పార్లమెంటులో చర్చ జరుగుతూ ఉంది. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి, లోక్ సభలో చరణ్ సింగ్ చాలా తీవ్రమయిన విషయం బయటపెట్టారు. బడ్జెట్ పేపర్లను ప్రభుత్వం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF)jకులీక్ చేశారని, ఇది భారత సర్వసత్తాక దేశపు రహస్యాన్ని లీక్ చేయడమేనని ఆయన ఆరోపించారు.అంతేకాదు, బడ్జెట్ పేపర్ల లీకయిందనేందుకు ఆయన డాక్యమెంటునుకూడా సభలో చూపించారు. ప్రధాని ఇందిరా గాంధీ ఈ ప్రతం చూసి వణికి పోయారు. అపుడు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ. ఆయన రాజ్యసభలో ఉన్నారు. వెంటనే ఆయనను లోక్ సభకు రప్పించారు. ఆయన హడావిడిగా వచ్చారు. లోక్ సభలో గంభీరంగా చరణ్ సింగ్ చేసిన ప్రసంగంఅంతా విన్నారు. సభ యావత్తు ఈ గండం నుంచి ప్రభుత్వం ఎలా బయటపడుతుందోనని ఉత్కంఠతో చూస్తూ ఉంది. ఆరోజులో బడ్జెట్ పేపర్ల్ లీక్ కావడమంటే ప్రభుత్వం కూలిపోవడమే. ఇలాంటపుడు ప్రణబ్ ముఖర్జీ ముఖంలో ఎలాంటి ఆందోళనలేదు. చరణ్ సింగ్ ఉపన్యాసానికి జవాబిచ్చే ముందు ఆయనొకసారి ప్రధాని వైపు చూసి కనుసైగతో ధైర్యం చెప్పారు.
తర్వాత చరణ్ సింగ్ కు జవాబిస్తూ , ‘ చరణ్ సింగ్ గారూ, మీరు చదివినదంతా కరెక్టే. అయితే, మీరు ఇపుడు చదవిని బడ్జెట్ పేపర్ పోయిన సంవత్సరానిది. అది గత ఏడాది నేను చేసిన బడ్జెట్ ప్రసంగం. తారీఖు సరి చూసుకోండి,’ అని అన్నారు. కాంగ్రెస్ పక్షాలు గొల్లున నవ్వాయి. బల్లలు చరిచాయని హిందూస్తాన్ టైమ్స్ రాసింది.
ప్రణబ్ ముఖర్జీ హిందీ
ఎంతకాలం ఢిల్లీలో ఉన్న ఆయన హిందీ మెరుగుపడలేదు. దీని మీద జోక్ ప్రచారం లో ఉంది. ఒక సారి ముఖర్జీ వ్యతిరేకులంగా వచ్చి ప్రధాని పివి నరసింహారావుకు ఫిర్యాదు చేస్తే క్యాబినెట్ నుంచి ఆయనను తప్పించి ఉత్తర ప్రదేశ్ కు గవర్నర్ గా పంపించండిన కోరారు. అపుడుప్రధాని ఏమన్నారో తెలుసా?
‘ఇప్పటికే ఉతర్త ప్రదేశ్ ప్రజలు సగం మంది కాంగ్రెస్ వదిలిపెట్టి ములాయాం సింగ్ యాదవ్ సమాజ్ వాది పార్టీలోచేరారు. ఇలాంటపుడు ప్రణబ్ ముఖర్జీని ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా వేస్తే , ఆయన హిందీ విని మిగతావాళ్లు కూడా పార్టీ వదలిపెట్టి పారిపోతారు,’ అని నరసింహారావు అన్నాట.
ఆయన లకీనెంబర్ 13 !
ప్రణబ్ ముఖర్జీ లకీ నెంబర్ పదమూడా? అదినికరంగా చెప్పలేం గాని, ఆయన జీవితంలో పదమూడో నంబర్ చాలా ముఖ్యమయిందిలా కనిపిస్తుంది. ఎందుకంటే, ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లోకి మారేదాక ఆయన ఒకే ఇంటిలో ఉన్నారు. అది టల్కటోరా రోెడ్ నెంబ. 13 బంగళా.ఇదే మంత పెద్ద బంగళా కాదు. రక్షణ మంత్రిగా ఉన్నపుడు అధికార నివాసం మార్చాల్సి వచ్చింది. దానికి ఆయన భార్య అంగీకరించలేదు. ఆయనకు సువ్రా ముఖర్జీలో విహామయింది కూడా జూలై 13న. పార్లమెంటుభవనంలో ఆయన కార్యాలయం నెంబర్ కూడా 13వ నెంబర్ దే. ఆయన భారత దేశానికి 13వ రాష్ట్రపతి అయ్యారు.
1935 డిసెంబర్ 11న నాటి బంగాల్ ప్రెశిడెన్సీ లోని మీరటి గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో జన్మించారు. ప్రణబ్ తండ్రి కె.కె.ముఖర్జీ. ప్రణబ్ కోల్‌కతా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం పట్టా అందుకున్నారు.
1957 జులై 13న సువ్రాతోె ముఖర్జీకి వివాహమయింది. 2015లో అనారోగ్యంతో మృతిచెందారు. ప్రణబ్ ముఖర్జీ క్లర్క్ స్థాయి నుంచి రాష్ట్రపతి భవన్ దాకా అనూహ్యమయిన మలుపుతు తిరుగుతూ సాగింది. రాజకీయ ప్రవేశానికి ముందు పలు ఉద్యోగాలు చేశారు. మొదట క్లర్క్‌గా, ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా పనిచేశారు. కొద్ది రోజులు ఆయన జర్నలిస్టుగా కూడా పనిచేశారు. దెషర్ దక్ పత్రికకు పాత్రికేయులుగానూ పనిచేశారు.
India grieves the passing away of Bharat Ratna Shri Pranab Mukherjee. He has left an indelible mark on the development trajectory of our nation. A scholar par excellence, a towering statesman, he was admired across the political spectrum and by all sections of society. pic.twitter.com/gz6rwQbxi6
— Narendra Modi (@narendramodi) August 31, 2020
జాతీయ రాజకీయాల్లోకి ఎలా వచ్చారంటే…
ప్రణబ్ ముఖర్జీ జాతీయ రాజకీయాల్లోకి రావడానికి కారణం వికె కృష్ణ మీనన్ లోక్ సభ ఎన్నికలపుడు విజయవంగా ప్రచారం నిర్వహించడమే. అది లోక్ సభ ఉప ఎన్నిక. కృష్ణ మీనన్ 1962 చైనా యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా కూడా ఉన్నారు. అపుడు పణబ్ ముఖర్జీ బంగ్లా కాంగ్రెస్ అనే సొంతపార్టీ నిర్వహించేవారు. మిడ్నపూర్ లోక్ సభ ఉప ఎన్నికలో వికె కృష్ణమీనన్ బంగ్లా కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కృష్ణ మీనన్ గెలిపించని తీరు ప్రధాని ఇందిరా గాంధీ కంటపడింది. అంతే, ఆయన రాజకీయ చక్రం ఒక కీలకమలుపు తిరిగింది. ఆయన ఢిల్లీకి పిలుపు వచ్చింది. ఆయన బంగ్లా కాంగ్రెస్ ను కాంగ్రెస్ విలీనం చేశారు. ఇందిరా గాంధీ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఇదే ఆయన తొలిసారి పార్లమెంటులో ప్రవేశించడం. ఆతర్వాత మరొక నాలుగు సార్లు 1975,1981,1993,1999 లలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. తర్వాత 2003, 2009లలో లోక్ సభ కు ఎన్నికయ్యారు.
Sharing some memorable moments with Pranab Da pic.twitter.com/7amNOBTMhG
— President of India (@rashtrapatibhvn) August 31, 2020
1975-77లో అంతర్గత అత్యవసర పరిస్థితిలో క్రియాశీలకంగా వ్యవహరించారు.
1982లో 47 ఏళ్ల వయసులోనే కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేవారు.
1982 నుంచి 1984 వరకు ఆర్థికమంత్రిగా కొనసాగారు.
1986లో రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.
రాజీవ్‌గాంధీ సూచనతో ఆర్‌ఎస్‌సీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
1991 నుంచి 96 వరకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
1995లో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు.
1997లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు.
India grieves the passing away of Bharat Ratna Shri Pranab Mukherjee. He has left an indelible mark on the development trajectory of our nation. A scholar par excellence, a towering statesman, he was admired across the political spectrum and by all sections of society. pic.twitter.com/gz6rwQbxi6
— Narendra Modi (@narendramodi) August 31, 2020
2004 నుంచి 2006 వరకు రక్షణ మంత్రిగా పనిచేశారు.
2006 నుంచి 2009 వరకు విదేశీ వ్యవహరాల మంత్రిగా ఉన్నారు.
2009 నుంచి 2012 వరకు ఆర్థికమంత్రిగానియమితులయ్యారు.
2012 జులై 25న భారత 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు.
2017 వరకు రాష్ట్రపతి పదవిలో కొనసాగారు.
2008లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు.
2019లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది.