ఆంద్రప్రదేశ్ నెల్లూరులో బారా షహీద్ దర్గా వద్ద ప్రతి ఏటా జరిగే రొట్టెల పండుగను ఈ ఏడాది కరోనా వల్ల రద్దు చేశారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నెల్లూరు రొట్టెల పండుగ రోజు వేలాది మంది భక్తులు జమకూడుతుంటారు. అందువల్ల కరోనా వ్యాపించే అవకాశం ఎక్కుగా ఉండటంతో పండగను రద్దు చేసినట్లు అధికారులుఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రతి ఏడాదిఆగస్టు28నుంచి సెప్టెంబర్3వరకు ఈ పండగ జరగాల్సి ఉండింది.
మొహరం పండుగ అయ్యాక మూడోరోజున నెల్లూరు స్వర్ణాల చెరువులో భక్తులు తమ వారి కోరికలను నెరవేరాలని అభిలషిస్తూ పరస్పరం రొట్టెలను భక్తులు మార్చుకోవడం ఈ పండగ విశేషం.
కులమతాలతో ప్రమేయం లేకుండా ప్రజలంతా ఈ పండగులో పాల్గొంటారు. మతసామరస్యానికి ఇది ప్రతీక. జిల్లాలో ఎంతో ఘనంగా జరిగే ఈ రొట్టెల పండుగ నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది(2020) అనుమతించలేదు.
పండగ సందర్భంగా కర్ణాటక తమిళనాడుల నుండివచ్చే భక్తులతోనెల్లూరు పట్టణం ప్రతి యేటా కిటకిట లాడుతూ ఉంటుంది. అంతేకాదు,విదేశాలనుంచి కూడా భక్తులు ఈపండగకు వేల సంఖ్యలో వస్తుంటారు.
ఈ సారి కరోనా ఎక్కువగా ఉండటం వలన దేశ నలుమూలల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి గుమికూడి రొట్టెల రొట్టెలు మార్చుకోవడం కరోన వ్యాప్తికి కారణమవుతుందని ఈ ఏడాది పండగను నిషేధించారు.
దర్గాలో 30.08.2020 నుండి 03.09.2020 దాకా ఐదు రోజులపాటు పరిమిత సంఖ్యలో (20 మందితో) కోవిద్ నిబంధనలకు లోబడి కేవలం గంధమహోత్సవం నిర్వహించుకునేందుకు మాత్రమే అనుమతి మంజూరు చేశారు.