నాటి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించి ఆరేళ్లుదాటినా రాజధాని వివాదం తేలడం లేదు. రాజధాని పీకల దాకా కుల రాజకీయాల్లో కూరుకుపోయింది. తెలుగుదేశం పార్టీ గెల్చి అమరావతి కృష్ణానది ఒడ్డున ఏర్పాటుచేయాలనుకుంది. అయితే, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే సారి టోక్యో, న్యూయార్క్, బీజింగ్, వంటి మహానగర మయసభ నిర్మించాలనుకుని అయిదేళ్లయినా అయిదు బిల్డింగుల మించి కట్టలేకపోయారు.
అమరాతి రంగుల కల ఆయనకు ఎన్నికల్లో ఉపయోగపడలేదు.చివరకు అమరావతి ప్రాంత ప్రజలు, ఈ రాజధాని వల్ల నేరుగా ప్రయోజనం పొందే గుంటూరు కృష్ణా జిల్లాల ప్రజలు కూడా నమ్మలేదు. 2019 ఎన్నికల్లో జగన్ కు వోటేశారు. చంద్రబాబ ఓడిపోయారు.
అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని అనేది ఏమీలేదు, ఇది ఒక కుల రాజధాని అన్చెప్పి వికేంద్రీకరణ సిద్ధాంతం ముందుకు తీసుకువచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖకు రాజధానిని తరలించాలనుకున్నారు.
ఇది కుదరదు కాబట్టి జ్యడిషియల్ క్యాపిటల్ (కర్నూలు), లెజిస్లేటివ్ క్యాపిటల్ (అమరావతి) అనేవాదన తీసుకువచ్చారు.
అయితే, ఇలాంటి రాజధానులు రాజ్యాంగం అనుమతించదని, అది చెల్లదరని సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి గోపాలగౌడ్ అంటున్నారు.
అయితే, తెలుగుదేశం అమరావతిని ఏమయినాసరే కాపాడుకోవాలనుకుంటున్నది. ఆ పార్టీ నాయకత్వంలో 245 రోజులుగా అమరావతి ప్రాంతంలో ‘సేవ్ అమరావతి’ ‘ అమరావతి పరిరక్షణ’ అంటూ ఉద్యమం నడుస్తూ ఉంది.
మరొక వైపు సుమారు 50 పిటిషన్లు మూడు రాజధానులకు వ్యతిరేకంగాకోర్టులో దాఖలయ్యాయి.
మొత్తానికి మూడు రాజధానుల వ్యవహారం కోర్టులోపడింది. జగన్ మూడు రాజధానుల కల వాయిదా పడింది.
జగన్ ఆరోపిస్తున్నట్లు అమరావతి ఒక ‘కుల రాజధాని’ అయితే, రాబోయేవి మరొక కుల రాజధానులనే విమర్శ బాగా వినబడుతూ ఉంది. ఆంధ్రలో కులం లేకుండా రాజకీయాలుంటాయా?కులాతీతంగా రాజధాని ఎపుడూ జరగదు.అందుకు రాజధాని కులయుద్ధంగా మారిపోయింది.
రాజధాని అమరావతి నుంచి ఒక ఇంచి కూడా కదలకుండా చూస్తామని తెలుగుదేశం పార్టీ శపథం చేసింది. రాజధానిని విశాఖకు మారుస్తామని వైసిపి తెగేసి చెబుతున్నది.
మొత్తానికి, రెండు రూలింగ్ కులాలు తమ రాజధానులను నిర్మించుకునేందుకు తీవ్ర గొడవపడుతున్నాయని మిగత అన్ని కులాల చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆంధ్ర రాజధాని ఏమవుతుంది? అమరావతిలో ఉంటుందా, లేక విశాఖకు పరిగెత్తుతుందా? తన రాజధానిని బీచి వడ్డు న ఏర్పాటు చేసుకోవడంలో జగన్ విజయవంతమవుతారా? ఆమూలన వచ్చే రాజధాని కంటే అమరావతి రాజధానే అనుకూలమని రాయలసీమ నాలుగు జిల్లా ప్రజలు భావించి వచ్చే ఎన్నికల్లో తీర్పిస్తారా? లేక ఎన్నికల దాకా ఆగకుండా రేపు లాక్ డౌన్ ఎత్తేస్తూనే అమరావతి పరిరక్షణఅంటూ ఉద్యమిస్తారా? అనేవి ఇపుడు ఎదురువుతున్న ప్రశ్నలు.
అయితే, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఉన్న రెడ్లకు రాజధాని అమరావతే అనుకూలమని , ఈ కోర్టు వివాదాలు చూశాక వాళ్లు కూడా మెల్లిగా అమరావతి వైపు మొగ్గుచూపుతారని ప్రముఖ జర్నలిస్టు డాక్టర్ నాటుబాంబుల సుధాకర్ రెడ్డి చెబుతున్నారు.
తిరుపతికి చెందిన డాక్టర్ సుధాకర్ రెడ్డి జర్నలిస్టు మాత్రమే కాదు, ప్రాక్టిసింగ్ సైకాలజిస్టు కూడా. రాష్ట్రరాజకీయాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్న పండితుడు. అమరావతి పరిరక్షణ ఉద్యమం ముందు ముందు తీవ్రమవుతుందని ఆయన చెబుతున్నారు.
ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన సొంతం. ఇది మొదట ఆయన ఫేస్ బుక్ లో వచ్చింది. తర్వాత, ట్రెండింగ్ తెలుగు న్యూస్ అందించారు.