(Ahmed Sheriff)
తెలుగు చిత్ర రంగం సృష్టించిన కళాఖండాలలో 1954లో వచ్చిన ‘విప్రనారాయణ’ఒకటి. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు (ఎఎన్ ఆర్ )విప్రనారాయణుడిగా నటిస్తే, వేశ్య దేవదేవిగా పి భానుమతి నటించారు. ఇది విజయవంతమయింది అని చెప్పుకుంటే సరిపోతుంది. కాని ఈ విజయం వెనక ఆసక్తికరమయిన విషయాలున్నాయని. వాటిలోకి వెళ్లేముందు ముందఈ కధేంటో చూద్దాం.
ఇదీ కథ
కావేరి నది ఒడ్డున ఒక ఆశ్రమం కట్టుకుని విప్రనారాయణుడు ఉంటాడు. విప్రనారాయణుడి మరొక పేరు తొండరాప్పొడిఆళ్వార్. వైష్ణవ సంప్రదాయాన్ని ఈ ప్రాంతంలో ప్రచారం చేసిన 12 మంది ఆళ్వార్లలో ఆయనొకరు. ఆయన శిష్యుడితో కలసి ఈ ఆశ్రమంలో ఉంటాడు. అపుడో చోళ రాజుదగ్గిర నాట్యంచేసి దేవదేవి అనే దేవదాసి తన సోదరి మధురవాణితో కలసి ఆదారిన పోతూ ఉంటుంది. ఇంత అందాలరాసి ఈ దారిపోతున్నా విప్రనారాయణుడు కన్నెత్తి కూడా చూడడు. దీనితో దేవదాసి అహంగాయపడుతుంది. ఎలాగైనా ఈ సన్యాసిని తన వలపుల వలలో వేసుకోవాలని ప్రతిజ్ఞచేస్తుంది. ఈ పథకంతో ఆమె ఆశ్రమంలోకి ప్రవేశించిన తన కట్టుకథతో కపటభక్తురాలిగా మారి విప్రనారాయణను తన వైపురకునేందుకు అక్కడే మకాం వేస్తుంది, ఆయనను తనవైపు తిప్పుకోవడంలో విజయవంతమవుతుంది.విప్రనారాయణుడు కాంతదాసుడవుతాడు. అయితే, అదే సమయంలో ఆమెలో అపరాధ భావన కూడామొదలవుతుంది. తర్వాత ఆమె ఆశ్రమం నుంచి ఇంటికెళ్లుతుంది. ఆమెతో పాటు విప్రనారాయణుడు కూడా వెళతాడు. అయితే, దేవదాసి తల్లి ఆయనను తరిమేస్తుంది.
తనకు భక్తుడికి వచ్చిన కష్టనాని దేవుడు (రంగనాథుడు) చూస్తూంటాడు.భాదపడతాడు. ఇక్కడ కథ చాలా మలుపులు తిరుగుతంది. శ్రీరంగనాధుడు రంగ ప్రవేశం చేస్తాడు. ఆయన కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ కమ్రంలో విప్రనారాయణుడికి ఒక బంగారు పాత్ర దేవదాసి ఇంట్లోకనిపిస్తుంది లభిస్తుంది. అది ఒక దేవాలయం నుంచి దొంగిలించిందని,దానిని విప్రనారాయణుడు వేశ్యకు ఇచ్చారని తెలుస్తుంది. రాజు ఆగ్రహించి ప్రనారాయణుడి చేతులు నరికేయాలనిఆజ్ఞాపిస్తాడు. తీరా ఇది జరగేపుడు శ్రీరంగ నాధుడు ప్రత్యక్షమయిన విప్రనారాయణుడెవరో కాదు తన మెడలోని ‘వైజయంతిమాల’ అని చెబుతాడు. దేవదేవి ఒక గంధర్వ కన్య అని కూడాచెబుతాడు. కథాంతంలో విప్రనారాయణుడు వైజయంతిమాల గా మారి దేవుడిలో మెడలోప్రకాశిస్తాడు. ఇదీ క్లుప్తంగా కథ.
రంగనాథుడి రూపం లో వున్న విష్ణు వును కొలిచే భక్తుడి పాత్రలో నటించాడు అక్కినేని. ఆయనకు జంటగా దేవ దేవి పాత్రలో దేవదాసిగా భానుమతి రామక్రిష్ణ నటించింది. ఇందులో దేవదాసి చెల్లెలు మధురవాణిగా నటించింది తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తల్లి సంధ్య.
భరణి పిక్చర్స్ నుంచి ఈ చిత్రం వచ్చింది. ఇది శ్రీ వైష్ణవం సాంప్రాదాయానికి సంభంధించిన “తొండరాదిప్పాడి అళ్వా ర్” జీవిత చరిత్ర.
ఆయన జీవితం భక్తి శృంగారాల మిశ్రమం.అప్పటికే విప్రనారాయణ నాటకంగా బాగా ప్రాచుర్యంలో ఉంది. అందుకే సినిమా రంగం మొదలవగానే నిర్మాతలను ఆకట్టుకున్న పౌరాణిక గాథలలో విప్రనారాయణ ఒకటి. అందుకే మూకీ కాలంలో మూకీ చిత్రంగా 1931లో వచ్చింది. మద్రాసు పెనిన్స్యులా ఫిల్మ్ కంపెనీ తీసింది. టి. కె రుక్మిని, టిఎస్ భాస్కర్ లీడ్ రోల్స్ ఉన్నారు. ఆరేళ్ల తర్వాత టాకీగా తెలుగులో వచ్చింది. అరోరా ఫిల్మ్ కార్పొరేషన్ అహింద్రా చౌదరి ఈచిత్రాన్ని నిర్మించారు. ఇందులో దేవదేవిగా కాంచనమాల, విప్రనారాయణ గా కస్తూరి నరసింహారావు నటించారు. అది బాగా హిట్టయింది. 1938లో తమిళంలో టాకీగాడైరెక్టర్ ఎ ఆదినారాయణ నిర్మించారు. సౌండ్ సిటి ప్రొడక్షన్స్ కోసం తీసిన ఈచిత్రంలో టంగుటూరి సూర్యకుమారి, కొత్త మంగళం శీను లీడ్ రోల్స్ లో కనిపిస్తారు. ఈ మధ్యలో బిఎన్ రెడ్డి కూడ ఒక విప్రనారాయణ సినిమా తీయాలని, దేవులపల్లి కృష్ణశాస్త్రి చేత స్క్రిప్టు కూడా సిద్ధంచేశారని, ఎందుకో ఆ ప్రాజక్టునుంచి విరమించుకున్నారని చెబుతారు.
తర్వాత భరణి పిక్చర్స్ వారి ఆరవ చిత్రంగా తెలుగులో మళ్లీ ప్రత్యక్షమయింది. అపుడుసహజంగానే భానుమతి దేవదేవి ప్రాతకు ఎంపికయ్యారు. విప్రనారాయణగా నిర్మాత రామకృష్ణ ఎఎన్ ఆర్ ని ఎంపిక చేశారు. భరణి పిక్చర్స్ వారు దీన్నొక అద్బుథ భక్తి రస కావ్యంగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఇందులో పాటలన్నీ అంతా ఇంతా పాపులర్ కాదు. ముఖ్యంగా భానుమతి పాడిన జయదేవుడి అష్టపది ‘సావిరహేతవ ధీనా…’ వినేవాళ్లని మైమరిపిస్తుంది.
అపుడొక వివాదం చెలరేగింది. అది విప్రనారాయణుడి పాత్రకి అక్కినేని నాగేశ్వరరావుని ఎంపిన చేయడం. నాగేశ్వరరావు నాస్తికుడయినందున, మహర్షి వంటి విప్రనారాయణుడి పాత్రకు యోగ్యడుకాదని రామకృష్ణ స్నేహితులు సలహా ఇచ్చారు. దీనిని రామకృష్ణ ఖాతరు చేయకుండా ముందుకు వెళ్లారు. దీనికి తగ్గుట్టుగానే ఆయన ఈ పాత్రని సవాల్ గా స్వీకరించారు. ఎఎన్ ఆర్ కూడా తన డైలాగులను చాలా శ్రద్ధగా ప్రాక్టీస్ చేశారు. ఈ చిత్రానికి పాటలు,మాటలు రాసిన సముద్రాలరాఘవచారి దగ్గిరే ఉచ్ఛారణ ఆయన ఈప్రాక్టీస్ చేసే వారు. అంతేకాదు భక్తి తన్మయత్వం ఎలా ఉంటుందో ఆరోజు మహానటుడిగా పేరున్న చిత్తూరు నాగయ్య నటించిన వాహినీ వారి ’భక్త పోతన’ చిత్రాన్ని పదే పదే చూసి జాగ్రత్తగా పరిశీలించారు. చిత్రం పూర్తయ్యాక ‘శ్రీ’ ఉచ్ఛారణ ఆయనకు నచ్చలేదట.దాని మళ్లీ డబ్బింగ్ చెప్పి ‘శ్రీ’ని సరిగ్గా పలికి పూర్తి చేశానని ఆయనే స్వయంగా తన అనుభవాల్లో రాసుకున్నారు. అంతిమంగా సినిమా తయారయింది. విడుదలయింది. ఆయన అద్భత నటన కు చాలా పేర్కొచ్చింది. నాస్తికుడు భక్తుడి గా ఎలానటించగలడన్న ఆయన విమర్శకులుంతా నోరెళ్లపెట్టేలా చేశారు ఎఎన్ ఆర్. ఇద భక్తి రస ప్రధానం కాబట్టే చిత్రం నిండా పాటలే ఉంటారు. చిత్రంలో పదిహేడు పాటలున్నాయి.
ఇక్కడొకవిశేషం. మొత్తం చరిత్రలో దేవదేవి,విప్రనారాయణ రెండు పాత్రలు వేసిన ఎకైక నటుడు నాగేశ్వరరావే. యన నాటకాలలో ఆడవేషం వేస్తున్నపుడు విప్రనారాయణ స్టేజినాటకంలో దేవదేవి పాత్రను పోషించేవారు. ఆ రోజులో ప్రఖ్యాత స్టేజి నాటకాల దర్శకుడు ఒద్ధిరాజు శ్రీరామ్మూర్తి వద్ద శిక్షణ పొందారు. దానితో ఆయన వేసిన దేవదేవిపాత్రకు బాగా ప్రేక్షకులకు ఆకట్టుకుంది. సినిమాల్లోకి వచ్చాక విప్రనారాయణ పాత్ర లో నటించి అంతకంటే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు
ఇక్కడ మరొక విశేషముంది. ఇందులో ఒక్క పాట కూడా ఘంటసాల పాడలేదు. ఎఎఎన్ కు ఘంట సాల ఒక్కపాటని అరుదైన చిత్రం కూడా ఇదే. అపుడు భానుమతికి, ఘంటసాలకు ఏవో అభిప్రాయాలొచ్చాయని అందుకే ఆయనకు అవకాశం రాలేదని చెబుతారు.
మరొక విశేషం ఈచిత్రంలో అపుడే చిత్రరంగంలో గాయకుడిగా వస్తున్న ఎఎం రాజగా కు ఉపయోగ పడింది. ఆయన అప్పటికింకా మద్రాసు పచ్చయప్ప కాలేజీలో చదువుతూనే ఉన్నారు. చాలా రెగ్యులర్ ఆయన సాలూరు రాజేశ్వరరావును కలుస్తూ ఉండేవారు. ఈ పరిచయంతో ధైర్యం చేసి ఆయన ఎఎంరాజాను విప్రనారాయణ లోకి తీసుకున్నారు. రాజేశ్వరరావునమ్మకాన్ని ఎఎం రాజ నిలబెట్టారు.
తన మధురమైన గాత్రంతో నాగేశ్వరరావు, భానుమతిలనటనకు తోడుగా నిలిచి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విప్రనారాయణ 1954 డిసెంబర్ 10న విడుదలయింది.
ఈ చిత్రం ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కాటెగిరీ లో 1954 నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ని పొందింది
అక్కినేని నటించిన విప్ర నారాయణ చిత్రాన్ని అదే పేరు తో తమిళ్ లో డబ్ చేసి 1955 లో విడుదల చేసారు.
(Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM
Consultant, PMP Certification, Project Management, Quality
Mob: +91 9849310610)
Mob: +91 9849310610)