మరచి పోలేని అనుభవంగా మిగిలిపోయే తుంబురు కోన యాత్ర

శేషాచలం కొండల్లో ఉన్న ఒక అందమయిన తీర్థం తుంబురు కోన. ఈ కోన చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో ఉంది. తిరుపతి సమీపంలోని పాపవినాశనం డ్యామ్ మీదుగా సనకనందన తీర్థం, సలీంద్రబండ, పింగదీసిన మడుగు మీదుగా  తుంబురు కోనకు చేరుకోవచ్చు. పాప వినాశనానికి ఏడు కిలోమీటర్ల దూరాన కోన ఉంటుంది.
లేదా తిరుపతి –కడప హైవే మీద మామండూరు, కుక్కల దొడ్డి గ్రామాల నుంచి బయల్దేరి కూడా తుంబుర తీర్థం చేరుకోవచ్చు. ఇదంతా అడవీ మార్గం. సుమారు 14 కి. మీ ఈ అడవిలో ప్రయాణించాల్సి ఉంటుంది.
ఈ ప్రయాణం మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. దారిపొడవునా చెట్లుచేమలు, కొండ శిఖరాలు, సెలయేళ్లు, నీటి మడుగులు,  అరుదైన  జంతువుల జాడలు కనిపిస్తూ ఉంటాయి.

 

ఈ కోన దారి లోయల్లో ఉదయపు నీరెండ బంగారు రంగు తో ఉంటుంది. తర్వాత  నారింజ, పసుపు పచ్చ, ఊదా, ముదురు గోధుమ రంగులకు మారుతూ  ఉంటుంది. సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడేటప్పుడు ఒకలాగ, అడ్డంగా, పక్కలకు, ఏటవాలుగా పడేటప్పుడు మరో విధంగానూ కాంతిని వెదజల్లుతాయి. సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తు నుంచి 3000 అడుగుల ఎత్తుదాకా ఈ పర్వత శ్రేణి సాగుతుంది.

One thought on “మరచి పోలేని అనుభవంగా మిగిలిపోయే తుంబురు కోన యాత్ర

Comments are closed.