గవర్నర్ సూచనలు పాటించనందునే తెలంగాణలో కరోనా విజృంభణ: భట్టి

 కొరొనా విజృంభిస్తుంది అని వైద్యశాఖలో పోస్టులు భర్తీ చేయండని  హాస్పిటల్స్ బెడ్స్ పెంచాలని గవర్నర్ కొన్ని నెలల క్రితమే లేఖలు రాసి  చేసిన సూచనలను టీఆరెస్ ప్రభుత్వం బేఖాతర్ చేయడం వల్ల రాష్ట్రమంతా అంతా కొరొనా విజృంభించిందని తెలంగాణ అసెంబ్లీ సిఎల్ పి నేత భట్టి విక్రమార్క విమర్శించారు.  కొరొనా తీవ్రతను ముందే పసిగట్టి తాము కూడా ప్రభుత్వానికి పలుసార్లు లేఖలు రాశామని వాటినీ ఖాతరు చేయలేదని ఆయన ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడు చెప్పారు.
గవర్నర్ ప్రభుత్వానికి మంచి సూచనలు చేస్తే గవర్నర్ పై విమర్శలు చేయడం కరెక్ట్ టేనా?  ప్రతిపక్షాలమీద మీడియా పైనా ఎదురుదాడి చేసిందే కాకా గవర్నర్ ను సైతం ఎదురిస్తారా? అని ప్రశిస్తూ  టీఆరెస్ ప్రభుత్వం రాజకీయ విలువలను బేఖాతర్ చేస్తున్నదని ఆయన విమర్శించారు.
‘గవర్నర్ ప్రభుత్వలోపాల మీద  విమర్శలు-సూచనలు చేస్తే విలువలు ఉన్న సీఎంలు రాజీనామాలు గతంలో చేశారు. రాజ్యాంగం-విలువలు ఉన్న వ్యక్తి కేసీఆర్ అయితే రాజీనామా చెయ్యాలి!‘ అని భట్టి వ్యాఖ్యానించారు.
‘గవర్నర్ తన రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడటం అభినందనీయం. గవర్నర్ తన వ్యాఖ్యలను మాటలకే పరిమితం చేయకుండా ప్రభుత్వాన్ని అదేశించి ఆచరణలో పెట్టించాలి. రాజ్యాంగం సృష్టించిన అధిపతి గవర్నర్- గవర్నర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని సీఎం గవర్నర్ కి క్షమాపణ చెప్పాలి,’ అని ఆయన డిమాండ్ చేశారు.