అనంతపురం జిల్లా తాడిపత్రి తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బెయిల్ మంజూరు అయింది. కడప జైల్లో ఉన్న ఆయన కరోనా పాజిటివ్ అని తేలింది.దీనితో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు కుప్పించింది. అధికారంలో ఉన్న వైసిపి పార్టీ కరోనాను అస్త్రంవాడుకుంటున్నదని,జైలులో ఉన్న ప్రభాకర్ రెడ్డి కరోనా సోకడానికి కారణం ప్రభుత్వమేనని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించిన సంగతి తెలిసిందే.
ఇదేవిధంగా ఇఎస్ ఐ స్కామ్ ఆరోపణలతో అరెస్టయి, ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న మాజీ మంత్రి అచ్చన్నాయుడు కూడా కోవిడ్ పాజిటివ్ అని తేలిసిది. దీనితో టిడిపి వర్గాల్లో కలకలం మొదలయింది. వారి అనారోగ్యనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని టిడిపి హెచ్చరించింది.
బహుశా దీని ప్రభావమేనేమో ఈ రోజు ప్రభాకర్ రెడ్డికి బెయిలు మంజూరు అయినట్లు ఆయన తరపున న్యాయవాదులు తెలిపారు.
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ విషయంలో జెసి ప్రభాకర్ రెడ్డిని ఆయన కుమారుడిని అరెస్టు చేసిన కడప సబ్ జెయిలులో ఉంచిన సంగతి తెలిసిందే.
నిజానికి మొన్న ఆయన బెయిలుమీద విడుదలయ్యారు. ఈ నెల ఆరవ తేదీన కడప సెంట్రల్ జైలు నుండి తాడిపత్రికి వస్తున్నారు కూడా. అయితే,ఆయన కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, తాడిపత్రి లో రూరల్ సిఐని దూషించరాని, ఆయన మీద ఎస్ సి ఎస్ టి నమోదు చేశారు.
కండిషన్ బెయిల్ పై సంతకం చేయడానికి అనంతపురం వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి తిరిగి కడపకు తరలించారు.
మంగళవారం జరిగిన కరోనా పరీక్షల్లో మాజీ ఎమ్మెల్యే కు పాజిటివ్ గా తేలింది. అనంతపురం జిల్లా కోర్టులో బుధవారం జరిగిన బెయిల్ పిటిషన్ పరిశీలనకు వచ్చింది. బెయిల్ మంజూరుఅయిందని ఆయన కుటుంబ సభ్యులు కూడా తెలిపారు.
జెసి మీద కెేసులు ఇవే : వెల్లడించిన మంత్రి నాని