Home Uncategorized తుక్కు లారీలు బస్సులయ్యాయి, జెసి ట్రావెల్స్ అక్రమాలు, చంద్రబాబు అండ : రవాణా...

తుక్కు లారీలు బస్సులయ్యాయి, జెసి ట్రావెల్స్ అక్రమాలు, చంద్రబాబు అండ : రవాణా మంత్రి పేర్ని వెంకట్రామయ్య

174
0
కుమారుడితో జెసి ప్రభాకర్ రెడ్డి
హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఆంధ్రప్రదేశ్ రవాణా,సమాచారా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విలేకరులతో మాట్లాడారు. అక్కడ ఆయన జెసి బ్రదర్స్ అరెస్టుకు దారి తీసిన పరిస్థితులను వివరించారు.
 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు బీఎస్-3 ప్రామాణికాలతో తయారైన ఏ వాహనమయినా  2017 మార్చి 31 తర్వాత ఎక్కడా తయారుచేయకూడదు. ఇలాంటి బిఎస్ 3 వాహనాలను అశోక్ లేల్యాండ్ దగ్గిర నుంచి 154 తుక్కు (స్క్రాప్)  వాహనాలు వారు కొన్నారు. ఇవి ఎక్కడెక్కడికి వెళ్లాయని ఆరా తీస్తే 98 ఛాసిస్‌లు 2018లో ఫేక్ డాక్యుమెంట్ లతో రిజిస్ట్రర్ అయ్యాయి.  32 ఛాసిస్‌లు ఏపీలో రిజిస్ట్రర్ అయ్యాయి. వాటిలో 32లోనూ 29 అనంతపురం, 3 కర్నూలు ఆర్టీవో ఆఫీస్‌లో రిజిస్ట్రర్ అయ్యాయి. మిగతా 24 వివిధ రాష్ట్రాల్లో అంటే తమిళనాడు రెడ్ హిల్స్‌లో 1, ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్ పూర్‌లో 1, కర్ణాటకలో 19 రిజిస్టర్ అయ్యాయి. మూడు మాత్రం ట్రేస్ అవ్వలేదు.
 ఏపీలో రిజిస్టర్ అయిన 32 లో 29 అనంతపురంలో, 3 కర్నూలులో అయ్యాయని నాని తెలిపారు. అయితేఅనంతపురంలో రిజిస్టర్ కాబడ్డ 29 లారీల్లో 4 జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సులుగా మార్చబడి తిరుగుతున్నాయని. అసలు రిజిస్ట్రేషన్ చేయడమే తప్పు అంటే లారీలను ట్రావెల్స్‌గా మార్చారు, అని నాని వెళ్లడించారు.
ఇవే జెసి బ్రదర్స్ గురించి మంత్రి వెల్లడించిన విశేషాలు
• బీఎస్3 వాహనాలను బీఎస్4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారు
• బోగస్ ఎన్ వోసీలు సృష్టించినందుకు కూడా కేసులు నమోదు
• లారీలను బస్సులుగా మార్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు
• జేసీ ట్రావెల్స్ అక్రమాలపై అన్ని సాక్షాలు ఉన్నాయి
• మీడియా సమక్షంలో ఆధారాలతో సహా చర్చకు సిద్ధం
• సుప్రీం కోర్టు నిబంధనలను జేసీ ఉల్లంఘించారు
• అశోక్ లే ల్యాండ్ దగ్గర మిగిలిన బిఎస్ 3 లారీలను ఛాసిస్ లను జెసి కొన్నారు
• తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించారు
• రిజిస్ట్రేషన్ చేసిన లారీలను బస్సులుగా మార్చారు
• ప్రజల ప్రాణాలతో దివాకర్ ట్రావెల్స్ చెలగాటమాడారు
• బోగస్ ఎన్ వో సీలు సృష్టించినందుకు కూడా కేసులు నమోదయ్యాయి
• టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నామంటూ చంద్రబాబు ఆరోపించడం దారుణం
జేసీ అక్రమాలు ఇవేనంటూ మీడియాకు తెలిపిన రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)
• జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం వారిని అనంతపురం తరలించంగానే 40 యేళ్ల ఇండస్ట్రీ, 14 యేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినని చెప్పుకొంటున్న చంద్రబాబు నాయుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు
• టీడీపీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే వారిని భయపెట్టడం కోసం అక్రమ కేసులు, అరెస్ట్ ల పేరుతో భయపెడుతున్నామంటున్నారు. 40 యేళ్ల అనుభవంలో ఇదా సంపాదించింది.
• చంద్రబాబు నాయుడు, ఆయన వారసుడు లోకేష్, చంద్రబాబు హయాంలో మంత్రులుగా పనిచేసిన వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. జేసీ ట్రావెల్స్ అక్రమాలపై అన్ని సాక్ష్యాలున్నాయి. ఎంతటివారైనా సరే మీడియా సమక్షంలో ఆధారాలతో చర్చకు సిద్ధం.
• అక్రమాలకు ఆధారాలున్నా చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
• ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి కాసుల కోసం కక్కుర్తి పడ్డారు.వీటన్నింటిని ఆధారాలతో సహా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బయటపెడుతుంది.
• కేంద్ర రవాణాశాఖ ఇచ్చిన జీవో ఆధారంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు బీఎస్ 3 ప్రామాణికాలతో తయారైన ఏ వాహనం అయినా సరే 2017 మార్చి 31 తర్వాత ఎక్కడా తయారుచేయకూడదు. షోరూంలో అమ్మకూడదు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందిన రవాణా శాఖ అయిన ఆ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయకూడదు.
• ఆ సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి అన్ని కంపెనీలు తమ వాహనాలను వెనక్కి తీసుకున్నాయి. అశోక్ లేలాండ్ కంపెనీ దగ్గర ఇంజన్ తో సహా మిగిలిపోయిన బీఎస్ 3 లారీ ఛాసిస్ లు 154 మిగిలిపోతే వాటిని జటాధర ఇండస్ట్రీస్ లో డైరెక్టర్ లుగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి శ్రీమతి జేసీ ఉమారెడ్డి, వారి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, వారి అనుచరుడు, మెసెస్ కంపెనీ సి. గోపాల్ రెడ్డి తీసుకున్నారు.
• బీఎస్ 3 వాహనాలైన 66 లారీలను 2018 లో ఫేక్ డాక్యుమెంట్లతో వీరు తీసుకున్నారని సమాచారం వచ్చింది. దాన్ని మేం 10 జనవరి 2020వ తేదీన రాష్ట్ర రవాణా శాఖ అశోక్ లేలాండ్ కు ఆ ఛాసిస్ నంబర్ లు పంపించాం. ఇవి తమ కంపెనీ వారే అమ్మారా అని అడిగాం.
• అశోక్ లేలాండ్ కంపెనీ వారు 23 జనవరి 2020 న జవాబిచ్చారు. 66 లారీలో 40 గోపాల్ రెడ్డి కి, జటాధర కంపెనీకి 26 ఛాసిస్ లు స్క్రాప్(పనికిరాని తుప్పు) కింద అమ్మామని చెప్పారు. అవే ఛాసిస్ లు ఐరన్ స్క్రాప్ కింద అమ్మామని సమాధానం ఇచ్చారు.
• మా దగ్గర రిజిస్ట్రర్ కాబడ్డ ఆ నెంబర్లను వెంటనే అనంతపురంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం. ఇన్వెస్టిగేషన్ కోసం ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు, పోలీసులు ఎంక్వైరీకి వెళితే నాగాలాండ్ రాష్ట్రం కోహిమాలో ఆ వెహికిల్స్ రిజిస్ట్రర్ కాబడ్డాయని సమాచారం వచ్చింది.
• కోహిమాకి ట్రాన్స్ పోర్ట్ అధికారులు, పోలీసులు విచారణకు వెళ్లారు. అక్కడ 66 వెహికిల్ లు రిజిస్ట్రేషన్ అయ్యాయని అవే ఎన్ వోసీ ద్వారా రాష్ట్రానికి వచ్చాయని తెలిసింది.
• అనంతపురం పోలీసులు లేలాండ్ కంపెనీ దగ్గర విచారణకు వెళితే 66 కాదు నిషేధించనబడిన ఛాసిస్ లు (స్క్రాప్ రూపంలో ఉన్నవి) 154 వెహికిల్స్ ను జటాధర, గోపాల్ రెడ్డి కంపెనీకి తుక్కు ఇనుము కింద అమ్మామని సమాధానమిచ్చారు. అందులో 50 లారీలు జటాధర కంపెనీకి, 104 లారీలు మెసెస్ సి.గోపాల్ రెడ్డికి అమ్మామని చెప్పారు.
• 154 ఎక్కడెక్కడికి వెళ్లాయని ఆరా తీస్తే 98 ఛాసిస్ లు 2018లో ఫేక్ డాక్యుమెంట్ లతో రిజిస్ట్రర్ అయినవని తెలిసింది. 32 ఛాసిస్ లు ఏపీలో రిజిస్ట్రర్ అయ్యాయని తెలిసింది. ఆ 32లోనూ 29 అనంతపురం, 3 కర్నూలు ఆర్టీవో ఆఫీస్ లో రిజిస్ట్రర్ అయ్యాయి. మిగతా 24 వివిధ రాష్ట్రాల్లో అంటే 1 తమిళనాడు రెడ్ హిల్స్ లో, 1 ఛత్తీస్ గడ్ లోని రాయ్ పూర్లో, 19 కర్ణాటకలో రిజిస్టర్ అయ్యాయి. మూడు మాత్రం ట్రేస్ అవ్వలేదు.
• 98 కోహిమాలో రిజిస్ట్రర్ అయినవి ఎన్ వోసీ తీసుకొని 97 ఏపీకి ట్రాన్స్ ఫర్ అయ్యాయి. ఒకటి కర్ణాటకకు కు వెళ్లింది. ఎన్ వోసీ ద్వారా వచ్చిన వాటిలో 54 అనంతపురంలో అందులో 15 వివిధ జిల్లాల్లో, మరో 28 కూడా అనంతపురంలోనే రిజిస్టర్ అయ్యాయి. ఈ 28లో 15 లారీలు తెలంగాణకు వచ్చాయి. 13 లారీలు కర్ణాటకకు వెళ్లాయన్నారు.
• చేతులు మార్చుకుంటూ రెగ్యులరైజ్ చేసుకునే పనిలో ఉన్నాయన్నారు. వీరు ఉద్దేశపూర్వక దొంగతనానికి పాల్పడ్డారు.
• ఏపీలో రిజిస్టర్ అయిన 32 లో 29 అనంతపురంలో, 3 కర్నూలులో అయ్యాయని చెప్పాం. అయితేఅనంతపురంలో రిజిస్టర్ కాబడ్డ 29 లారీల్లో 4 జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సులుగా మార్చబడి తిరుగుతున్నాయి.
• రిజిస్ట్రేషన్ చేయడమే తప్పు అంటే లారీలను ట్రావెల్స్ గా మార్చారు. ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టారు. ప్రజల ప్రాణాలంటే వీరికి లెక్కలేదు. ప్రజల ప్రాణాలంటే బాధ్యత లేదు. వీళ్లా ప్రజాప్రతినిధులు(గతంలో).
• రిజిస్టర్ అయిన 154లో ఏపీలో రికార్డు ప్రకారం 101, కర్ణాటకలో 33, తెలంగాణ లో 15, తమిళనాడు లో 1, ఛత్తీస్ గడ్ లో 1, 3 ట్రేస్ అవ్వలేదన్నారు.
• 97 ఏపీ నుండి కర్ణాటక కు వెళ్లిన 13లో రికార్డు వెరిఫై చేస్తే 6 లారీలకు పోలీస్, ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఎన్ వోసీ కావాలి. కానీ ఆ రెండింటి బోగస్ ఎన్ వోసీలు సృష్టించారు. వీటి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికి 6 వెహికిల్స్ వి బయటపడ్డాయి.
• ఏపీ ప్రభుత్వం, ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ రిజిస్టర్ కాబడిన 101 నిషేధిత లారీల్లో 91 క్యాన్సిల్ చేశాం. మరో 6 కోర్టులో ఉన్నందువల్ల కోర్టు పర్మీషన్ కు అప్లై చేశాం. కోర్టు అనుమతులు తీసుకొని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాం.
• ఇప్పటికి 62 లారీలను సీజ్ చేశాం. అందులో 4 బస్సులుగా మారిన వాటిలో 3 బస్సులను సీజ్ చేశాం. అంటే 62లో ఓవరాల్ గా 59 లారీలు, 3 బస్సులను సీజ్ చేయడం జరిగింది. మిగతావాటి కోసం గాలిస్తున్నాం.
• 101లో 97 లారీలు 4 బస్సుల్లో 90 వెహికిల్స్ కి ఫేక్ ఇన్సూరెన్స్ లు. ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు కట్టకుండా వీళ్లే సొంతంగా ఇన్సూరెన్స్ పేపర్ లు తయారు చేసుకున్నారు. అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్రజలకెంత నష్టం ? ప్రజల ప్రాణాల పరిస్థితి ఏంటి ?
• ఈ బస్సుల్లో కూడా నిషేధిత లారీలను దొంగకాగితాలతో రిజిస్ట్రేషన్ చేయడం, ఆ లారీలను 4 బస్సులుగా మార్చడం, వాటన్నింటికి ఫేక్ డాక్యుమెంట్లు, ఇన్సూరెన్స్ కాగితాలు సృష్టించి బస్సులు తిప్పుతున్నారు .. వీటన్నింటికి సంబంధించి అనంతపురం పోలీసులు, రవాణా శాఖ అధికారుల వద్ద ప్రతిదీ పూర్తి ఆధారాలున్నాయి బ్లాక్ అండ్ వైట్ లో.
• జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, వారి కుటుంబసభ్యులు ఎంత దుర్మార్గం. రూపాయి కోసం గడ్డికరిచే మనుషులు వీళ్లు. వీళ్లు వైఎస్ జగన్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నామంట. ఈ పాపాలు అక్రమకేసులా ? ఎవరు అక్రమాలు చేస్తున్నారు ?
• చంద్రబాబు నాయుడు అండ, ఒకసారి టీడీపీలో ఎమ్మెల్యే, ఎంపీగా చేస్తే, అక్రమ సంపాదన ఉంటే తప్పులు చేసినా, పాపాలు చేసినా ఎవరూ అరెస్ట్ చేయకూడదు. కేసులు పెట్టకూడదు.
• గడిచిన 5 యేళ్లలో చంద్రబాబు ప్రభుత్వంలో చట్టం వాళ్ల చుట్టం గా పనిచేసిన పరిస్థితి. ఇవాళ కూడా అలా ఉండాలంటే ఎలా ?
• బాబు హయాంలో తప్పులు ప్రోత్సహించిన పరిస్థితి. డబ్బులు కోసం టువంటి దుర్మార్గాన్ని అయినా చేయండి అని భుజం తట్టిన పరిస్థితి.
• జగన్ ను ఎంత బూతులు తిడితే ఇలా పాపాలు చేయాలని టిప్పులు ఇచ్చారు
• జగన్ ను అసభ్యంగా తిట్టినందుకు జేసీ దివాకర్ రెడ్డి అన్నదమ్ములకు కూలీ ఏంటంటే ఇలాంటి పాపాలు చేయమని ..తాను కళ్లు మూసుకుంటానని చెప్పారు బాబు.
• అక్రమ కేసులు పెడుతున్నామని, తమ పోరాటం ఆగదని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నారు. లోకేష్ నాయుడు ఆలీబాబా అయితే మిగతావాళ్లంతా దొంగలు.
అయిదేళ్లు రాష్ట్రాన్ని, ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకున్నారు. నేడు శ్రీరంగనీతులు చెబుతున్నారు.
• రావిచెట్టుకు వేపచెట్టుకి వయసు వచ్చినట్లు మనకు వయసొస్తే సరిపోదు. వయసుకు తగ్గట్టు భాష ఉండాలి. మీరు మాట్లాడే భాష ధర్మమా ?
• అచ్చెన్నాయుడు, మీ అబ్బాయి పాపాలు చేసి దోచుకుతింటుంటే ఆయన బీసీ కాబట్టి అరెస్ట్ చేయొద్దంటారే తప్ప ఆయన తప్పు చేయలేదు, దోచుకోలేదు, అన్యాయంగా కేసులు పెట్టారని ఎక్కడా చంద్రబాబు అనట్లేదు. బీసీ కాబట్టి అరెస్ట్ చేయొద్దంటున్నారు ? ఇదెక్కడి ధర్మం.
• జేసీ ప్రభాకర్, దివాకర్ తప్పులు చేయలేదని మాట్లాడట్లేదు. టీడీపీ వాళ్లపై కేసులు పెట్టొద్దంటున్నారు
• చంద్రబాబు నాయుడును ఆహ్వానిస్తున్నాం. హైదరాబాద్ లో, జూమ్ లో ఎక్కడైనా మీడియా సమక్షంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ అరెస్ట్ మీద, అక్రమాలపై నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం.చర్చకు రండి.
• ఇది వైసీపీ ప్రభుత్వం. ఎంత వారినైనా, ఆఖరికి తనతో నడిచే వ్యక్తులనైనా ఉపేక్షించేదిలేదు, ఎంతటివారినైనా చట్టానికి లోబడి కఠినంగా శిక్షించడమనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానం.
• చట్టం ఎవరికీ చుట్టం కాదు పాపం చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందే. తప్పుచేస్తే పేర్నినానిని కూడా శిక్షించవచ్చు. తప్పుచేస్తే చట్టపరమైన చర్యలుంటాయి.