కొరోనా సోకినపుడు మనిషిలోని అన్ని శరీర భాగాలలో అది వృద్ధి చెందుతుంది. అందుకనే వాసనపోవడం నుంచి ఆయాసం వరకు లక్షణాలు కనిపిస్తాయి. అవేవి మనకు హాని చేయవు. కాని ఒక ఊపిరితిత్తులు గుండెలో వృద్ధి చెందే వైరసే ప్రాణాంతకం అవుతుంది. ఏం?
ఇక్కడ కూడా వైరస్ కంటే మన శరీరం చూపించే ఓవర్ రియాక్షనే ఎక్కువ ప్రాణాంతకం అవుతుంది.
వైరస్ కు మన తెల్లరక్తకణాలకు జరిగే యుద్ధంలో కొన్ని ఇన్ఫ్లమేటరీ ద్రవాలు, పదార్థాలు, విడుదల అవుతాయి. అవి ఆక్సిజన్ మార్పిడి జరిగే పొర దగ్గర చేరుకోని చనిపోయిన తెల్లరక్తకణాలు తో కలిసి పొరలాగా గడ్డకట్టి ఆక్సిజన్ మార్పిడిని అడ్డుకొని ARDS (Acute respiratory distress syndrome ) అనే పరిస్థితి ని కలిగిస్తాయి.
అప్పుడు ఆక్సిజన్ మార్పిడి కష్ఠం అవుతుంది. ఈ పరిస్థితులు లో వెంటిలేటర్ద్వారా ఆక్సిజన్ శాతం పెంచి ప్రయత్నం చేస్తారు. మరలా మన శరీరమే వారం పదిహేను దినాలలో తన తప్పుతెలుసుకోని ఓవర్రియాక్షన్ను క్రమబధ్ధీకరిస్తుంది.
ఈ సమయంలో నే వెంటిలేటరు అవసరం. 99% కు ARDS రాదు. అది IgE (Immunoglobulin E) ఎక్కువ ఉన్నవారికి, అలెర్జీలు ఉన్నవారికి, డయాబెటిక్ వారికి కొంచం ఎక్కువ వస్తుంది. మిగతా వారిలో కొంచెం ఓవర్ రియాక్షన్ అయినా సర్దుకుంటుంది.
గుండెలోని కణజాలలో కూడా ఇలా జరిగినపుడు కార్డియోమయోపతి అని, అరిత్మియాలనే స్థితి వల్ల గుండె వేగంగా కొట్టుకుని అరుదుగా ఆగిపోతుంది. ఇది అంత ఎక్కువగా రాదు.
మిగతా 95% మందికి ఎందుకు రికవరీ అవుతున్నారంటే వారికి నాచురల్గానే ఇమ్యూనిటీ ఉంటుంది. భయపడాల్సిన పనిలేదు. ఊరికే అదురుకోని చావకండి. కొరోనా అనేది ఇన్ప్లుయంజా లాగే ఒక బలహీనమైన వైరస్. 99%ను ఏమిచేయలేకపోయింది. ధైర్యం గా ఉండండి, జాగ్రత్తలు పాటించండి.
(Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS),గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు ,కర్నూలు. ఆంధ్రప్రదేశ్, కోవిడ్ కమాండ్ కంట్రోల్ ప్రత్యేక అధికారి.విజయవాడ.)