ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ అంటూ.. ఈరోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి లేఖ లో విషయాలను వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధికా ప్రతినిధి, శాసన సభ్యుడు అంబటి రాంబాబు ఖండించారు. ఇందులో టెలిఫోన్ టాపింగ్ జరిగిందనే దానికంటే ప్రధాన మంత్రి పొగిడిన విషయాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. టాఫింగ్ చేస్తున్నారనే ఒక అబద్దాన్ని ప్రధాని దృష్టికి తీసుకుపోయే సాకుతో ఆయన ప్రధానిని పొగిడి దగ్గిరయ్యేందుకు లేఖ ను వాడుకున్నారని ఆయన విమర్శించారు. లేఖలోటెలిపోన్ టాపింగ్ గురించి ఒక ఆధారం చూపకపోవడాన్ని ప్రస్తావిస్తూ రాష్టంలో టెలిఫోన టాపింగ్ జరుుతున్నట్లు ఒక్క అధారమయిన చంద్రబాబునాయుడు చూపగలరాా అని అంబటి సవాల్ విసిరారు.
అంబటి రోజు చంద్రబాబు నాయుడు రాసిన లేఖ మీద లేవనెత్తిన అంశాలివి:
1. ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ అంటూ.. ఈరోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు లేఖ ప్రారంభంలోనే ప్రధానిని కీర్తించే ప్రయత్నం చేశారు. ఈ లేఖ చూశాక.. చంద్రబాబును సూటింగా కొన్ని ప్రశ్నలు అడగాలనిపించింది.
a. మోడీ గారి నాయకత్వాన్ని గురించి ఇంత బ్రహ్మాండంగా పొగిడే దశకు చంద్రబాబు ఎప్పుడు వచ్చాడు..?
b. ఇదే మోడీని ఎన్నికల ముందు చంద్రబాబు ఏ విధంగా మాట్లాడాడు..?
c. భార్యను పాలించలేనివాడు.. భారత దేశాన్ని ఎలా పాలిస్తాడు.. అని అన్నారా.. లేదా..?
c. నీ కన్నా నేను సీనియర్ ని.. నా కన్నా నీవు జూనియర్ వి. నీ వల్ల భారత్ దేశంకు అన్యాయం జరుగతుంది.
e. మోడీ దుష్ట పాలనను అంతమొందిస్తానని.. మోడీకి వ్యతిరేకంగా దేశంలోని మిగతా అన్ని పార్టీలను ఏకం చేసేందుకు రాష్ట్రాలు పట్టుకుని తిరిగిన మాట వాస్తవం అవునా..? కాదా?
2. ఏ ఆధారాలతో చంద్రబాబు మాట్లాడతాడు…? ఆయన పది మందిని హత్య చేశాడని, ఆయన తనయుడు మానభంగాలు చేశాడని.. ఇలాంటి ఆరోపణలే ఎవరన్నా చేస్తే.. ఏమిటి సమాధానం..? – గతంలో మీ ప్రభుత్వమే.. సజ్జల రామకృష్ణా రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయించింది. – గతంలో మీ ప్రభుత్వమే ఇజ్రాయిల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని మీ రాజకీయ అవసరాల కోసం, మీ పార్టీ అవసరాల కోసం మీరే కొనుగోలు చేశారు. – పచ్చ కామెర్ల వాడికి లోకమంతా.. పచ్చగా కనిపిస్తుందన్న పద్ధతుల్లో మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు తప్ప.. జడ్జిల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, సామాజిక కార్యకర్తల ఫోన్లు ఎవరైనా ఎందుకు ట్యాప్ చేస్తారు.. ?
3. చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడు.. ? – జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్నది అబద్ధం. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం.. ఇంటెలిజెన్స్ ట్యాప్ చేసే ఫోనులు ఉగ్రవాదులవి, అసాంఘీక శక్తులవి, నిషేధిత సంస్థలవి, సమాజంలో అల్లకల్లోలం సృష్టించాలని కుట్రలు పన్నేవారివి ఉంటాయి. ఇందులో తనది ఏ కేటగిరి.. అని చంద్రబాబు భయపడుతున్నాడు. – లేక తన మనీ ల్యాండరింగ్ అంతా బయటకు వస్తుందని ఆయన భయపడుతున్నాడా.. ?
4. తనతో పాటుగా మరికొందర్ని కూడా ఒక ముఠాగా తయారు చేసి, ముందు ఒక ఛానల్ లో వేయడం, తర్వాత మరో ఛానల్ లో దాని మీద చర్చలు పెట్టడం, ఒకటి, రెండు పత్రికల్లో ఆ అసత్యాన్ని ప్రచురించడం.. వీటన్నింటి ఆధారంగా కోర్టులో రిట్ పిటీషన్లు వేయడం.. ఆ తర్వాత తాను ఒక లేఖ రాయడం, ఆ లేఖను మళ్ళీ ఎల్లో మీడియాలో ప్రచురించి డిబేట్ లు చేయడం.. ఇదీ చంద్రబాబు మార్క్ రాజకీయం.
5. చంద్రబాబు వ్యవహారం ఎలా ఉందంటే.. అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు. ఇదీ చంద్రబాబు నైజం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. ఆయనతో జత కట్టిన దేశంలోని కొన్నిపార్టీలకు కూడా బాగా అర్థమైంది. – ఎన్నికల ముందు మోడీని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాడు.. ప్రధాని అయ్యాక ఆయన నాయకత్వాన్ని పొగుడుతాడు. రేపు తేడా వస్తే మళ్ళీ ఇదే మోడీ దుర్మార్గుడు అని మాట్లాడగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.
6. వ్యవస్థలను టార్గెట్ చేస్తున్నామని… రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని చంద్రబాబు మాట్లాడాడు.. జ్యుడీషియరీ, పత్రికా విలేఖరులు, న్యాయవాదులు, సోషల్ యాక్టివిస్ట్ లు, ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుంది అని ఆరోపించాడు. – చంద్రబాబు నాయుడును సూటిగా ప్రశ్నిస్తున్నాం. దీనికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా.. ? ఆధారాలు చూపిస్తారా.. ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేసి… ప్రభుత్వం పై బురదచల్లడం ఎంతవరకు కరెక్టు..?
7. చంద్రబాబు మాట్లాడిస్తున్నట్టే.. ప్రధానికి లేఖ రాసినట్టే.. ఉదాహరణకు చంద్రబాబు పది హత్యలు.. లోకేష్ పది రేప్ లు చేశారని ఎవరైనా అంటారనుకోండి.. ఆధారాలు చూపించమంటే.. ఏం చూపించాలి…? అలానే ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్.. అంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు కూడా.
8. చంద్రబాబే ఒక పథకం ప్రకారం.. జ్యుడీషియరీ మీద నిఘా… అంటూ ముందుగా ఒక పేపర్ లో రాయిస్తాడు.. దానిని మరో టీవీ ఛానల్ లో చెప్పిస్తారు.. వాళ్ళ పార్టీ నేతలతో మొరిగిస్తారు.. దాన్ని మిగతా వారితో అరిపిస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రికి లెటర్ రాస్తారు.. – అసలు ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగిందంటే.. ఆ మీడియా చెప్పింది.. ఈ మీడియా.. చెప్పిందని మాట్లాడతారు. ఏ మీడియా చెప్పింది చంద్రబాబూ.. నీ మీడియా చెబితే అది నిజం అయిపోద్దా..?
9. ఆధారాలు లేని ఆరోపణలు చేసి.. ఈ ప్రభుత్వాన్ని ఏదో విధంగా దెబ్బకొట్టాలని చూడటం దురదృష్టకరం. నీచమైన వ్యవహారం. – ఇదంతా పచ్చ మీడియాతో చంద్రబాబు ఆడిస్తున్న నాటకం. – ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. – జ్యుడీషియరీ, న్యాయవాదులు, పొలిటీషియన్స్, సోషల్ యాక్టివిస్ట్ లు.. ఈ ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదు. చేయదు కూడా. – ఏదైనా ఉంటే చట్టబద్ధంగా చేస్తాం.. సంఘవిద్రోహ శక్తులు.. అహింసకు పాల్పడాలని చూసే రౌడీ మూకలు.. బస్సులు తగలేయాలనో.. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చూసే శక్తులవో.. ఉగ్రవాద సంస్థలు, నిషేధిత సంస్థలు ఏమైనా కుట్రలకు పాల్పడితే.. అటువంటివాటిపై నిఘా పెడతారు. – చట్ట వ్యతిరేకంగా ఎవరి ఫోన్ ట్యాప్ చేయం. ఒక పిచ్చి పేపర్ లో రాసి.. ఒక పిచ్చోడి చేత అరిపించి.. న్యాయ వ్యవస్థ మీద నిఘా అంటూ లేఖలు రాయడం సిగ్గుచేటు. ఇటువంటి డ్రామాలు ఆడటం చంద్రబాబుకు అలవాటుగా మారింది.
10. ఈరోజు టీడీపీ బలం 23 సీట్లుకు పడిపోయింది. ప్రతిపక్షంగా విఫలమైంది. ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకమైంది. – హైదరాబాద్ లో పార్టీ ఆఫీసు ఉంది.. అమరావతిలో కూడా పార్టీ ఆఫీసు ఉంది.. చివరికి చంద్రబాబు పరిస్థితి ఏమిటంటే.. కనీసం పార్టీ ఆఫీసుకు వెళ్ళి 74వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండా ఆవిష్కరించే ధైర్యమే లేదు. ఇంట్లో జెండా ఎగురేసుకోవాల్సిన పరిస్థితి. అటువంటి పార్టీ, అటువంటి నాయకుడు గురించి ఎవరు మాత్రం పట్టించుకుంటారు..?
11. తెలుగుదేశం పార్టీ రోజురోజుకీ కుచించుకుపోతున్న రాజకీయ పార్టీ. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక, కేవలం 14 మాసాల్లో..ఈ ప్రభుత్వం ప్రారంభించి, అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు.. 4 కోట్ల మంది లబ్ధిదారులకు.. దాదాపు రూ. 60 వేల కోట్లు నేరుగా వారి ఖాతాల్లోనే జమ అయ్యాయి.
12. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ ప్రభుత్వాన్ని గెలవలేరు.. అందుకే కుట్రలు చేసి, ఆ వ్యవస్థ, ఈ వ్యవస్థను దూరం చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. సోషల్ యాక్టివిస్టులను, పత్రికా విలేఖర్లను మాకు దూరం చేయాలని చంద్రబాబు పన్నాగాలు పన్నుతున్నాడు. న్యాయ వ్యవస్థతో మాకు సంఘర్షణ పెట్టాలని చూస్తున్నారు.
13. అసలు చంద్రబాబుకు ఉలుకెందుకు..? – చంద్రబాబు ఏమైనా సంఘ విద్రోహ శక్తులతో కార్యకలాపాలకు ప్రయత్నిస్తున్నారా..? లేక రాజద్రోహానికి పాల్పడుతున్నారా..? – గతంలో అధికారంలో ఉండి దోచుకుని.. సింగపూర్, మలేషియాల్లో దాచుకున్న డబ్బు బయటకు వస్తుందని భయపడుతున్నారా..? – ఆంధ్రజ్యోతి.. ఆంధ్రజ్యోతి కథ ఇంకో ప్రెస్ మీట్ లో న చెబుతాను. మీడియా ఉందని.. ప్రజల్లో బలం లేని మీరు.. మీడియా ద్వారా ప్రభుత్వంపై బురదచల్లితే ఊరుకునేది లేదు..
14. ఎన్నికలకు ముందు కూడా ఇలానే మీడియాలో మీ బలం ఏమిటో చూపారు.. తీరా ఫలితాలు వచ్చాక ఏమైంది.. 23 సీట్లు వచ్చాయి. మీడియాతో రాష్ట్రాన్ని పరిపాలించాలనుకోవడం.. మీడియాతో లేని ప్రజా వ్యతిరేకత ఉందని చూపించాలనుకోవడం సాధ్యం కాదు. ఇది చంద్రబాబు గుర్తిస్తే బాగుంటుంది.
15. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం- అభివృద్ధి- మంచి కనపడకూడదని.. ఇలా డైవర్షన్ కు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. – ఈ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా.. కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమం- అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళుతుంటే.. అన్నివర్గాలకూ న్యాయం చేస్తుంటే.. మీడియాలో, టీవీల్లో తప్పుడు వార్తలు వండివారుస్తూ.. కుట్రలకు పాల్పడుతున్నారు.
16. చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం.
1. మీరు ఏమైనా సంఘ విద్రోహ శక్తులతో మమేకమయ్యారా..? ఉగ్రవాదులతో మమేకమయ్యారా..? 2. సంఘ విద్రోహశక్తులతో కలిసిపోయి రాష్ట్రంలో అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారా..? 3. అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారా.. ? – ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనుకుంటే.. అది మీకు సాధ్యం కాదు చంద్రబాబూ.. గతంలో ఏమైందో గుర్తుంచుకో.. ఇదే ప్రయత్నం చేసి ఏ విధంగా భంగపడ్డారో తెలుగు రాష్ట్రాల ప్రజలు చూశారు. – ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఆలోచన చేయాలని చంద్రబాబుకు చెబుతున్నాను.
17. న్యాయ వ్యవస్థ మీద నిఘా పెట్టారని, ఫోన్లు ట్యాపింగ్ పెట్టారని అడ్డగోలు వార్తలు వండివార్చిన ఆ పత్రికకు నోటీసులు ఇచ్చాం. అవాస్తవాలు రాస్తే కఠిన చర్యలు తీసుకుంటాం… ఇటువంటి వార్తలు, వండివార్చిన కథనాలు, ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్న వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం.. – చంద్రబాబు తన ఎల్లో నాటకం ద్వారా.. ప్రభుత్వం పై బురదచల్లాలని చూస్తున్నారు. ఇది నిష్ప్రయోజనం. ప్రజల్లో పలుచబడిపోయిన తెలుగుదేశం.. ఇలాంటి నక్కజిత్తులకు పాల్పడుతుంది. ప్రజలు నమ్మరు.
18. ప్రధానికి రాసిన లేఖలో.. ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర ప్రభుత్వ సంస్థ చేత విచారణ చేయించాలని చంద్రబాబు అడుగుతున్నాడు. 1. సీబీఐ ఈ రాష్ట్రంలోకి రావటానికి వీల్లేదని గతంలో చంద్రబాబు అన్నాడు. ఐటీ రాకూడదన్నాడు. కేంద్రం కక్షకట్టి సాధిస్తుందని మాట్లాడాడు. సీబీఐ రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా చట్టాలు కూడా చేశాడు. 2. నిన్న వద్దన్న ఈ సంస్థల మీద చంద్రబాబుకు ఎప్పుడు నమ్మకం కలిగింది.. అధికారంలో ఉన్నప్పుడు పోయిన నమ్మకం.. అధికారం పోయిన తర్వాత కలిగిందా…?
19. రమేష్ ఆసుపత్రికి చెందిన కోవిడ్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ఒక కులాన్ని టార్గెట్ చేస్తున్నారనడంలో ఎటువంటి వాస్తవం లేదు. నేరాలకు, నిర్లక్ష్యానికి కులం ఉండదు. నేరాన్ని నేరంగానే చూడాలి. – రమేష్ ఆసుపత్రికి సంబంధించిన హోటల్ లో వారి నిర్లక్ష్యం వల్ల .. అగ్ని ప్రమాదం జరిగిన మాట వాస్తవమా.. కాదా.. దోషులు ఎవరైనా శిక్షించబడాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. శిక్షించబడాల్సిందే.. – ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఏం జరిగింది. చంద్రబాబు ఆరోజు ఏం మాట్లాడారు.. రమేష్ ఆసుపత్రి గురించి ఎందుకు మాట్లాడరు…? అంటే మీ వాళ్ళకు ఒక న్యాయమా..? వేరేవాళ్ళకు ఇంకో న్యాయమా..? – ఈ ప్రభుత్వంలో కులం, మతం, పార్టీలకతీతంగా చర్యలు తీసుకోబడతాయి. సందేహం లేదు.