సాధారణంగా కోమార్బిటీస్ ఉన్నవాళ్లు, వృద్ధులు కోవిడ్ వల్ల ఎక్కువగా చనిపోతారని డాక్టర్లు శాస్త్రవేత్తలు హెచ్చరికచేస్తూఉంటారు. కోమార్బిడిటీస్ అంటే బిపి, షుగర్, గుండెజబ్బులు,స్థూలకాయం, క్యాన్సర్ వగైరా వంటి దీర్ఘకాలిక జబ్బులు. వీటితో బాధపడుతూ వున్నవాళ్లకు కోవిడ్ వల్ల ఎక్కువ దుష్ప్రభావం ఉంటుంది. కోవిడ్ మృతుల్లో ఎక్కువ మంది వీళ్లేని ప్రభుత్వం లెక్కలు కూడా చూపిస్తూ ఉంది.
ఆరోగ్యంగా దిట్టంగా ఉన్నవాళ్లకు కోవిడ్ వల్ల ప్రాణా పాయం లేదని చాలా ధీమా కల్పిస్తూ వచ్చింది ప్రభుత్వం. ఇలాంటి వాళ్లలో బాగా ఇమ్యూనిటీ (రోగనిరోధక శక్తి) ఉంటుందని, వాళ్లకు కోవిడ్ అలాా వచ్చి ఇలా పోతుందనేది సాధారణం ప్రజలూ నమ్ముతుంటారు
అయితే, ఇపుడు తెలంగాణలో పరిస్థితి తారుమాయిందని వార్తలొస్తున్నాయి. ఇక్కడ కోమార్బిడిటీస్ వున్న వాళ్లలోనే మరణాలరేటు బాగా తగ్గిపోయింది. ఆరోగ్యంగా దిట్టంగా ఉన్న వాళ్లు ఎక్కువ మంది కోవిడ్ సోకి చనిపోతున్నారు. ఇలా చనిపోతున్న వారి సంఖ్య తెలంగాణలో పెరుగుతూ ఉంది. ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయమే.
కోవిడ్ మృతుల్లో బిపి, షుగర్, గుండెజబ్బులున్నవారి సంఖ్య 80 శాతం దాకా ఉండేది. ఇది ఆగస్టులో 42 శాతానికి తగ్గింది. ఇదేకాలంలో ఆరోగ్యం వున్నవారు, ఈ మూడు రకాలజబ్బులేమీ లేనివారు కూాడా పెద్ద సంఖ్యలో చనిపోయారు. కోవిడ్ మృతుల్లో వీరి శాతం 42 శాతమని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
అంటే మనకు కోమార్బడిటీస్ లేవు, కరోనా మనజోలికి రాదునుకుని భరోసాతో ఉండేందుకు వీల్లేదనేందుకు ఇదొక హెచ్చరిక. అలాంటి ధీమాతో జాగ్రత్తలు తీసుకోవడం మానేస్తే తీవ్ర పరిణామాలంటాయి.
తెలంగాణలో నిన్నటి దాకా కోవిడ్ వల్ల 684 మంది చనిపోయారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలోకరోనా పాజిటివ్ కేసులు 90వేలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో 1863 కొరొనా పాజిటివ్ కేసులు నమోదయయాయి. కొత్తగా 10 మరణాలు నమోదుకావడంతో మొత్తం మరణాలు 684 అయ్యాయి. ఇందులో జిహెచ్ ఎంపి – 394, మేడ్చెల్-174, కరీంనగర్- 104, వరంగల్ అర్బన్-101, రంగరెడ్డి-131, సిరిసిల్ల-90, సంగారెడీ-81, జగిత్యాల-61, సిద్దిపేట-60 కేసులు నమోదు. రాష్ట్రంలో కోవిడ్ నుంచి కొత్తగా కొలుకున్నది-1912, మొత్తంగా కొలుకున్నవారి సంఖ్య-66 196 అని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆక్టీవ్ కేసులు- 23 379.
ఆరోగ్యంగా ఉన్నవారెందుకు చనిపోతున్నారు?
దీనికి కారణం లైఫ్ స్టైలే నిన డాక్టర్లు చెబుతున్నారు. కోమార్బిడిటీస్ ఉన్నవారు జాగ్రత్త తీసుకుంటుంటే, ఆరోగ్యంగా ఉన్నవాళ్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా మంది సొంతం వైద్యం చేసుకోవడం, లేదా బాగా ఆలస్యంగా డాక్టర్లను సంప్రదిస్తున్నారు. దీనివల్ల రోగ లక్షణాలు మరుగున పడుతున్నారు. దీనిని డాక్టర్ మాస్కింగ్ ఆఫ్ సింప్టమ్స్ (masking of symptoms) అంటున్నారు. దీనితో శరీరంలోపల కేస్ లోడ్ పెరిగిపోతున్నది.
ఆరోగ్యంగా దిట్టంగా ఉన్నా, వారిలో కేస్ లోడ్ పెరిగిపోయిచిక్కు సమస్యలొస్తున్నాయి. కొంతమంది డాక్టర్ల సలహాలేవీ తీసుకోకుండా స్టెరాయిడ్స్ కూడా వాడుతున్నారు. దీనితో ప్రాణాాపాయంలో పడిపోతున్నారు,’ అని అపోలో హాస్పిటల్స్ క్రిటికల్ కేర్ నిపుణుడు వై డాక్టర్ శ్రీధర్ చెప్పారు.
ఆసుపత్రులకు చికిత్సవచ్చే సమాయానికి వీళ్లకు ఆక్సిజన్ అవసరమవుతూ ఉంటుంది. రోగలక్షణాలు కనబడుతూనే అత్యవసరంగా వైద్య చికిత్సచేయించుకోవాలి. ఈదశలో ప్రాణాలను కాపాడేందుకు చాలా మార్గాలున్నాయి. ఈ దశలో ఆసుప్రతికి రావడం ఆలస్యమయితే విపరీతపరిణామాలుంటాయని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాాజారావు చెప్పారు.
IDSP ఎపుడో ఈ విషయం గుర్తించింది
ఇపుడు తెలంగాణలో ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడాకోవిడ్ బారిన పడుతూండటం ఎక్కువవూత ఉందిగాని, జాతీయస్థాయిలో కూడా ఇది ఎపుడో కనిపించింది.
భారత ప్రభుత్వం జరిపిన ఒక విశ్లేషణ ప్రకారం కోవిడ్ తో మరణించిన వారిలో ఏ జబ్బు లేని వాళ్లు 43 శాతం దాకా ఉన్నారు. ఇంటెగ్రేటెడ్ డిసీజ్ సర్వైలాన్స్ ప్రోగ్రాం (integrated disease surveillance program –IDSP) జూలైలోనే ఈ విషయాన్ని గుర్తించింది. తొలికోవిడ్ కేసు నమోదయినప్పటినుంచి జూలై 2 దాకా ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రల డేటాను ఈ సంస్థ విశ్లేషించింది. ఈ మూడు రాష్ట్రాలలో జూలై నాటికి 17,834 మరణాలు సంభవించాయి. ఇందులో 15,962 మంది మృతులకు సంబంధించి వయసు, కోమార్బిడిటీస్ వివరాలు లభ్యమయ్యాయి.
ఐఎస్ డిపి విశ్లేషణ ప్రకారం మృతుల్లో57 శాతం మందిలో మాత్రమే కోమార్బిడిటీస్ కనిపించాయి. అంటే వారిలో మాత్రమే షుగర్, బిపి, గుండెజబ్బుల వంటి దీర్ఘకాలిక సమస్యలున్నాయి. అంటే మిగతా మృతులు కేవలం కోవిడ్ వల్లే మరణించారని అర్థం