తెలంగాణ కు చెందిన రాజేంద్రప్రసాద్ కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ మూడో దశలో పాల్లొంటున్నాడు. ప్రపంచాన్ని ఒక మహమ్మారి నుంచి కాపాడేందుకు ఉద్దేశించిన ఒక వైద్య పరీక్షలో పాల్గొంటున్నానని ఆయన గర్వపడుతున్నాడు. ఇలాంటి చారిత్రాత్మక వ్యాక్సిన్ పరీక్షలో పాల్లొనే అవకాశం రావడం చాలా అరుదు అందుకే తాను స్వచ్ఛందంగా వ్యాక్సిన్ ను తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఆయన ఇపుడు ఒక డోస్ తీసుకున్నారు.
తెలంగాణ మెట్ పల్లికి చెందిన రాజేంద్ర ప్రసాద్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) షార్జాలో పనిచేస్తున్నాడు. తన అనుభవాన్ని ఆయన చెన్నైకి చెందిన The Lede న్యూస్ పోర్టల్ ప్రతినిధితో షేర్ చేసుకున్నారు.
చైనా కు చెందిన ఫార్మష్యూటికల్ కంపెనీ సైనోఫార్మ్ (Sinopharm) కోవిడ్ ట్రయల్స్ ను జూలై నుంచి యుఎఇ లో ప్రారంభించింది.
ఇక్కడేఫేజ్ టు వ్యాక్సిన్ ట్రయల్స్ ఫలితాలు సురక్షితంగా వచ్చాయి. వ్యాక్సిన్ సురక్షితమయిన, కరోనా సోకిన వారిలో ఇమ్యూన్ సిస్టమ్ బాగా స్పందించిందని తేలడంతో మూడో దశ (Phase III) క్లినికల్ ట్రయల్స్ కు వెళ్లారు.
ఇందులో ఫేజ్ 1 ట్రయల్స్ 108 మంది వలంటీర్లకు వ్యాక్సిన్ ఎక్కించారు. ఫేజ్ టు లో ఇంతకంటే ఎక్కువ మందికి ఎక్కించారు. ఇపుడు మూడో దశలో ఇంకా విస్తృతంగా వ్యాక్సిన్ ను ఎక్కిస్తారు.
ఆగస్టు 13 నుంచి మొదలయిన ఈ క్లినికల్ ట్రయల్స్ లో 15,000 మంది వలంటీర్లను ఎంపిక చేశారు.
“With around 20 million positive cases and 749,000 deaths, the COVID-19 juggernaut is in an unstoppable momentum in the world. Lockdowns and other measures have not been effective. The only hope is a vaccine. So, when a government calls in volunteers for the world’s first phase III human train of COVID-19 vaccine, why should I step back? I volunteered for the world. And I was not alone, there were many like me.” అని The Lede ప్రతినిధికి ఆయన చెప్పారు.
ఈ ట్రయల్స్ కు 18 నుంచి 60 సంవత్సరాల లోపున్న వారే అవసరం. దీనికితోడు వారు ఆరోగ్యంగా ఉండాలి. కోవిడ్ నెగటివ్ అయి ఉండాలి. ఈ అర్హతలుండటంతో రాజేంద్ర ప్రసాద్ వలంటీర్ గా ఎంపికయ్యాడు. క్లినికల్ ట్రయల్స్ పాల్గొంటున్నందున రిస్క్ ఏమయిన ఉందా అని అడిగినపుడు తన వైద్యులు వివరాలందించారని రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు. ‘వ్యాక్సిన్ తీసుకున్నపుడు సాధారణంగా ఎదురయ్యే రియాక్షన్ గురించి వైద్యులు నాకు వివరించారు. దీనివల్ల కొద్ది గా నొప్పి ఉంటుంది. వ్యాక్సినేషన్ కోసం సూది గుచ్చిన చోట చర్మం ఎర్రగా కందుతుంది. అక్కడ గడ్డ కట్టినట్లు (induration) వుతుంది. దురద (pruritus) పెడుతుంది అని వారు వివరించారు,’ అని రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు.
అయితే, వ్యాక్సిన్ తీసుకున్నాకు తనకు ఎలాంటి రియాక్షన్ రాలేదని ఆయన చెప్పాడు. ఒకవేళ కొద్దిగా జ్వరం, తలనొప్ప వంటి శారీరక సమస్యలు వచ్చినా, అవి వాటంతటకవే పోతాయని వారు చెప్పినట్లు కూడా ఆయన చెప్పారు. ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే ట్రయల్ సెంటర్ కు చెప్పాల్సి ఉంటుంది.
రాజేంద్ర ప్రసాద్ రెండు డోస్ ను 28 రోజుల తర్వాత తీసుకుంటాడు. ఈ ట్రయల్ ఇలా 12 నెలల పాటు కొనసాగుతుంది. ఈ మధ్యలో నేను జబ్బు పడితే వాళ్లకి సమాచారం అందించాలి. మధ్య మధ్యలోవాళ్లు ఫోన్ లో నన్న సంప్రదిస్తూ ఉంటారు. అపుడపుడు వ్యక్తిగతంగా కూడా కలుసుకోవలసి వస్తుంది. అన్ని విధాల సహకరిస్తానని ఒక ఫారమ్ మీద సంతకం కూడా తీసుకున్నారు, అని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.
వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ కు ఒప్పుకున్నపుడు స్నేహితులు నిరుత్సాహపరిచినా, కుటుంబ సభ్యులనుంచి ప్రోత్సాహం లభించిందని ఆయన చెప్పారు. ‘ఇది ఒక వ్యక్తికి జీవితంలో కాలంలో ఒకసారే దొరికే అవకాశం. ఈ విషయాన్ని నేను మా పిల్లలకు కూడా చెప్పాను. ఒక గొప్ప వ్యాక్సిన్ ట్రయల్ ముందుకు వచ్చిన వలంటీర్లలోనేనూ ఒకడిని. ఈ వ్యాక్సిన్ ప్రపంచాన్ని కోవిడ్ నుంచి కాపాడుతుందని నాకు నమ్మకం ఉంది,’ అని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.
ఈ ట్రయల్ సెంటర్ ‘4Humanity’ ‘సుమారు 45 వేల మందికి ట్రయల్స్ జరపాలనుకుంది. అయితే, ఇపుడు ఇంకా ఎక్కువ మందికి చేయాలని, బహరైన్ కు కూడా విస్తరింపచేసినట్లు అధికారులు చెబుతున్నారు.
Source: The Lede
Like this story? Pl share it with a friend