ఆంధ్రులు పెనం మీది నుంచి పొయిలో పడ్డారా?: వడ్డే పుస్తకం సుధాకర్ రెడ్డి సమీక్ష

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ‘పెనం మీద నుండి పొయ్యిలో పడ్డాం’ అని ఒకపుస్తకం రాశారు. ఈ పుస్తకం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానల మీద ఒక విమర్శ. పుస్తకాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వెంకటగోపాల గౌడ్ రిమోట్-రిలీజ్ చేశారు. ఒకపుడు వడ్డే చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. తర్వాత ఆయనకు దూరమయ్యారు. తొలినాళ్లలో జగన్ ను స్వాగతించారు.ఆపైన, 2019 ఎన్నికల తర్వాత జగన్ విధానాలనుంచి దూరం జరిగారు. ఈ నేపథ్యంతో ఆయన ఈ పుస్తకం రాశారు. పుస్తకాన్ని అమరావతి రైతులకు అంకితమిచ్చారు.
పుస్తకంలో నాలుగు అధ్యాయాలున్నాయి. అవి: 1. అమరావతి నుండి రాజధాని తరలింపు నవ్యాంధ్ర ప్రదేశ్ ప్రగతికి గొడ్డలిపెట్టు కాగలదు 2. జగన్ మోహన్ రెడ్డి పిచ్చి తుగ్లక్ పాలనలో  ప్రజావ్యతిరేక నిర్ణయాలు 3.సువర్ణావకాశాన్ని చేజేతులు జారవిడుచుకున్న నారా చంద్రబాబు నాయుడు 4. బిజెపి కపట నాటకాలు.
రాజ్యాంగంలోని నిబంధనలను, చట్టాలను అనుసరించి అమరావతినుండి రాజధానిని వైజాగ్ కు తరలించడం అసాధ్యమని  గ్రహించి, మూర్ఖపుడు పట్టుదలను విడనాడి అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని ప్రకటంచి  జగన్ గౌరవాన్ని కాపాడుకోవాలనేది  అని స్పష్టంగా రచయిత పుస్తకంలో అభిప్రాయపడ్డారు.
ఈ పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్టు, ప్రాక్టిసింగ్ సైకాలజిస్టు డా. నాటుబాంబుల సుధాకర్ రెడ్డి సమీక్షిస్తున్నారు.
పుస్తకాన్ని విశాలాంధ్ర పబ్లిషర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.పుస్తకం కావలసి వారు పోనె నెంబర్లు +91-9392959999,8919427484  లేదా vaddesrao@yahoo.co.in సంప్రదించవచ్చు.

ఈ సమీక్షలోవ్యక్తం చేసిన అభిప్రాయాలు సుధాకర్ రెడ్డి వ్యక్తిగతం. ట్రెండింగ్ తెలుగు న్యూస్ కు సంబంధం లేదు.