కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సెల్ఫ్ క్వారంటైన్

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ఆయన మల్లప్పురం కలెక్టర్ కె గోపాలకృష్ణన్ తో కలసి ఆయన మొన్న విమాన ప్రమాదం జరిగిన  ప్రదేశానికి వెళ్లారు. అయితే, అక్కడి నుంచి వచ్చాక,కలెక్టర్ గోపాల కృష్ణన్ కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆయన తో పాటు సబ్ కలెక్టక్, అసిస్టెంట్ సబ్ కలెక్టర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తో పాటు మరొక 20 మంది సిబ్బంది కూడా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. వీరంతా కరిపూర్ విమాన ప్రమాద సహాయ చర్యల్లో చురుకుగా పాల్గొన్నారు. వీరందరూ కోవిడ్ పాజిటివ్ అని ఈ రోజు తెలిసింది.
 ఈవిషయం తెలియగానే, ముఖ్యమంత్రి పినరయి విజయన్ సెల్ఫ్ క్వారంటైన్ పాటిస్తున్నారు. అయితే, ఇది ముందు జాగ్రత్త చర్య మాత్రమే నని అధికారులు చెబుతున్నారు.ఎందుకంటే, కోళికోడ్ మెడికల్ కాలేజీలో ఉన్న విమాన ప్రమాద క్షతగాత్రులను పరిశీలించేందుకు వెళ్లేముందు ఆయన గోపాలకృష్ణన్ తో కలసి చర్చించారు.
ముఖ్యమంత్రి తిరువనంతపురం క్లిఫ్ హౌస్ నివాసానికే పరిమితమవుతారని, ఆయన స్వాతంత్య్రోదినోవత్సం నాడు పతాకా విష్కరణకూడా జరపరని, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి బదులు దేవస్థానాల మంత్రి కడకంపల్లి సురేంద్రన్ం పాల్గొంటారని ప్రభుత్వం ప్రకటన విడుల చేసింది.
ఇప్పటికే ముగ్గురు క్యాబినెట్ మంత్రులు క్వారంటైన్ లో ఉన్నారు. ఇందులో హెల్త్ మినిస్టర్ కె కె శైలజ కూడా ఉన్నారు.
ప్రమాదం జరిగిన మరుసటి రోజు ముఖ్యమంత్రి కలసి ప్రమాద స్థలానికి వెళ్లిన మరొక నలుగురు మంత్రులను కూడా హోం క్వారంటైన్ లో ఉండాలని డాక్టర్లు సూచించారు.
ముఖ్యమంత్రి తో పాటు ఏడుగురు మంత్రులు హోం క్వారంటైన్ లో ఉండటంతో ఆగస్టు 24 జరగాల్సిన ఒక రోజు అసెంబ్లీ సమావేశం జరిగే అవకాశం లేదు.