రిమాండులో ఉన్నా, అచ్చెన్నాయుడు క‌రోనా పాజిటివ్..!

అమరావతి : మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది.ఆయన ఇఎస్ ఐస్కామ్ ఆరోపణలో అరెస్టయిన ఇపుడు  జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉంటున్నారు. ఆయనకు ఆరోగ్యంగా సరిగా లేనందున  అచ్చన్నాయుడికి ఇక్కడి రమేష్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
 బుధవారం  ఉదయం నుంచి  అచ్చన్నాయుడు జలుబుతో బాధపడుతున్నారు. దీనితో ఆయనకు  కరోనా పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ పరీక్షల్లో ఆయన  పాజిటివ్ అని తేలిసింది.
అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిని రాష్ట్ర హైకోర్టు పర్యవేక్షిస్తున్నది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రతివారం ఆస్పత్రి హైకోర్ట్‌కు అసుపత్రి బులెటిన్ సమర్పించాలి.
కరోనా లక్షణాలు కనిపించడంతో  అచ్చెన్నాయుడుకు రమేష్‌ ఆస్పత్రి వైద్యులు కరోనా చికిత్స అందిస్తునట్లు అధికారులు చెప్పారు.
అయితే, ఆయనకు  కరోనా సోకడంత్పా కుటుంబ సభ్యులు, అనుచరులు  ఆందోళన చెందుతున్నారు.
రెన్నెళ్ల కిందట అచ్చన్నాయుడు అరెస్టు

 

మాజీ మంత్రి, తెలుగుదేశం  శాసన సభ ప్రతి పక్ష ఉప నేత కింజరాపు అచ్చెన్నాయుడిని నిమ్మాడలో ఎసిబి అధికారులు జూన్ 12న  అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంటిమీద తెల్లవారుజామున  ఎపిబి దాడులు జరిగాయి. కార్మిక మంత్రిగా ఉన్నపుడు ఇఎస్ ఐ లో జరిగిన స్కామ్ మీద దర్యాప్తు జరుగుతున్నదర్యాప్తులో భాగంగా  ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని  అరెస్ట్ చేశారని చేశారు.
పొద్దునే శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామానికి విజయవాడ నుంచి ప్రత్యేక బస్సుల్లో ఎసిబి అధికారులు వచ్చారు.ఆయన  అదుపులోకి తీసుకొని ప్రత్యేక బస్సులో  తమతో పాటు తీసుకెళ్లారు. ఎసిబి దాడుల సందర్భంగా  నిమ్మాడ గ్రామంలో ప్రత్యేక బలగాలను మోహరించారు. ఆయనని బలవంతంగా లాక్కెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.అచ్చన్నాయుడు ఈ మధ్యే అపరేషన్ చేయించుకున్నారని, ఆరోగ్యం బాగాలేదని భార్య విజయ మాధవి చెప్పారు.
“పొద్దున ఏడున్నర సమయంలో చాలా మంది అధికారులు గోడదూకి వచ్చారు. ఆయనకు నిన్ననే సర్జరీ జరిగింది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమన్నారు. వచ్చిందే తడవుగా వాళ్లు ఆయనని తీసుకెళ్లిపోయారు. ముందులు వేసుకునేందుకు కూడా అనుమతించలేదు,’ అని ఆమె చెప్పారు. .