ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టిడిపి పాలనలో చిత్తూరు జిల్లా రేణిగుంట, ఏర్పేడుప్రాంతం ఎలక్ట్రానిక్స్ హబ్‌గా రూపుదిద్దుకుంది. బ్యాటరీ తయారీ నుంచి ఎలక్ట్రానిక్స్ వస్తువులు పూర్తిగా తయారయ్యేంత వరకూ అన్ని విభాగాలు తయారు చేసే పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. చిత్తూరు జిల్లా తొలిసారి అభివృద్ధి మ్యాప్ లోకి ఎక్కింది.
ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిగా నారా లోకేశ్ కృషితో దేశంలో అత్యధిక మొబైల్ ఫోన్లు తయారయ్యే జిల్లాగా చిత్తూరు రికార్డులు సాధించింది. వరల్డ్ జెయింట్ ‘ఫాక్స్‌కాన్’ ,సెల్కాన్,కార్బన్,డిక్సన్ కంపెనీలు తరలి వచ్చాయి.
తిరుపతిలో ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ (IIDT) చంద్రబాబు హయాంలోనే ఆరంభమైంది. పరిశ్రమలు రావాలంటే అంతర్జాతీయ ఎయిర్పోర్టుండాలనే లక్ష్యంతో నాటి టిడిపికి చెందిన కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు చొరవతో రేణిగుంట ఎయిర్ పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేందుకు కృషి చేశారు.
టిడిపి సర్కారు కృషితో IIT, IISERవంటి జాతీయస్థాయి ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. ఐదేళ్లలో అన్ని జిల్లాలతో సమానంగా వెనకబడిన చిత్తూరు జిల్లాని అభివృద్ధి పథంలో పయనింపజేసిన ఘనత చంద్రబాబునాయుడిది.
అయితే, ఇపుడు చిత్తూరు జిల్లా పరిస్థితి తలకిందులవుతూ ఉంది. గత 15 నెలల జగన్‌రెడ్డి పాలనలో చిత్తూరులో ఒక్క పరిశ్రమా రాలేదు. సరికదా, ఉన్నవీ తరలివెళ్లిపోతున్నాయి.
జగన్‌రెడ్డి సర్కారు అభివృద్ధిని తుడిచేసేందుకు కంకణం కట్టకుంది. రాష్ట్రం నడిమధ్యలో 480 కిలోమీటర్ల ప్రయాణించి చేరుకునే అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. ఇపుడు చిత్తూరుకు రాజధానిని 900 కిలోమీటర్ల దూరానికి తరిమేసి, ప్రజలను వ్యయప్రయాసలకు గురిచేయడమొక్కటే ఒక్కటే జగన్‌రెడ్డి మార్కు పరిపాలనగా కనిపిస్తూ ఉంది. ఇది విధ్వంసమే కాని అభివృద్ధి ఎలా అవుతుంది..
(జి నరసింహ యాదవ్, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ తుడా చైర్మన్)