ఆగస్టు 14 నుండి శ్రీశైల దర్శనాలు తిరిగి ప్రారంభం

శ్రీశైలమహాక్షేత్రంలో నిశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాల రేపటి నుంచి పునరుద్ధరిస్తున్నారు.  ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 5.30 గంటల నుండి7.30 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. ఈ విషయాన్ని ఆలయ  ఈవో కె.ఎస్.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు.
10 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయసు ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.
దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా ఆన్ లైన్ లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.  అలాగే భక్తులు తమ వెంట ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని ఇవొ తెలిపారు.
కొంతమంది ఉద్యోగులకు కరోనా సోకడంతో శ్రీశైలంలో దర్శనాలు కొద్దిరోజుల కిందట  నిలిపివేశారు.