ఇవి తెలిస్తే అరటి తొక్కని కూడా వదలరు!!

ఒక విషయం చెప్తే అరటి తొక్కేమ్ కాదు అంటారేమో కానీ ఇది మాత్రం నిజం..!! అరటిపండు (bnana) లో గుండెను భద్రంగా కాపాడే పోషక విలువలు మెండు!! మెదడు, రక్త సంబంధిత వ్యాధులు కూడా నివారించొచ్చు.
# బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తర్వాత రోజూ అరటిపండును తీసుకోవటం వలన 1500 మిల్లీ గ్రాముల పోషక విలువలు శరీరానికి అందుతాయి. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.
-> అరటి పండులోని పొటాషియం వలన బ్లడ్ ప్రెషర్ (blood pressure), ఫ్లూయిడ్స్ (fluids) కంట్రోల్ లో ఉంటాయి.
-> అరటి పండులోని పొటాషియం (potassium) వలన ఎముక పటిష్టత (bones strenthen) పెరుగుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఎముక గట్టిగా ఉండదు వారు రోజూ అరటిపండు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
# అరటి పండులోని B 6  రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. దీనివల్ల మెదడుకి బలం చేకూరి మానసిక ఒత్తిడి (mental pressure) తగ్గుతుంది.
# దీనిలోని ఫైబర్ (fiber) గుణం మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
# హ్యాంగోవర్ (hang over) తో బాధపడేవారు అరటిపండులో తేనె కలుపుకుని తింటే సమస్య తగ్గుతుంది.
# అరటిపండు గుజ్జుకి తేనె (honey) చేర్చి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖం నునుపు సంతరించుకుని మెరుస్తుంది.
# అరటి తొక్కేమ్ కాదు అని తొక్కని తీసి పారేయకండి ఆ అరటి తొక్క(banana peel) తో ముఖాన్ని రుద్దుకుంటే మొటిమల తాలూకు మచ్చలు తగ్గు ముఖం పడతాయి.