ఒక విషయం చెప్తే అరటి తొక్కేమ్ కాదు అంటారేమో కానీ ఇది మాత్రం నిజం..!! అరటిపండు (bnana) లో గుండెను భద్రంగా కాపాడే పోషక విలువలు మెండు!! మెదడు, రక్త సంబంధిత వ్యాధులు కూడా నివారించొచ్చు.
# బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తర్వాత రోజూ అరటిపండును తీసుకోవటం వలన 1500 మిల్లీ గ్రాముల పోషక విలువలు శరీరానికి అందుతాయి. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.
-> అరటి పండులోని పొటాషియం వలన బ్లడ్ ప్రెషర్ (blood pressure), ఫ్లూయిడ్స్ (fluids) కంట్రోల్ లో ఉంటాయి.
-> అరటి పండులోని పొటాషియం (potassium) వలన ఎముక పటిష్టత (bones strenthen) పెరుగుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఎముక గట్టిగా ఉండదు వారు రోజూ అరటిపండు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
# అరటి పండులోని B 6 రక్తంలోని గ్లూకోస్ లెవెల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. దీనివల్ల మెదడుకి బలం చేకూరి మానసిక ఒత్తిడి (mental pressure) తగ్గుతుంది.