వెంటిలేటర్‌పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టడంతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి సోమవారం బ్రెయిన్‌ సర్జరీజరిగింది. అది విజయవంతమయింది.అయితే ఆయనకు కరోనా సోకింది.
అనారోగ్యానికి గురైన ప్రణబ్ ను  సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రిలో చేరారు.  శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ స్వయంగా ట్వీట్ చేశారు.

 

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్మీ ఆసుపత్రికి వెళ్లి మాజీ రాష్ట్రపతి ఆరోగ్యం గురించి వాకబుచేశారు. ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలువరు కాంగ్రెస్ నేతలు కూడా ప్రణబ్ ముఖర్జీ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తండ్రి త్వరగా కోలుకోవాలని ఆయనకుమారుడు అభిజీత్ ముఖర్జీ ఆకాంక్షించారు. ఆయన కోలుకునేందుకు దేశ ప్రజలంతా ప్రార్థించాలని ఆయన కోరారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) 2102-17 మధ్య రాష్ట్రపతిగా ఉన్నారు.
మాజీ రాష్ట్రపతి ఇతవ వ్యవస్థలన్నీ నిలకడగా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు.