తులసి ఉన్న వాకిళ్లు సుఖ సంతోషాలకు లోగిళ్ళు అనటంలో అతిశయోక్తి లేదు!!!
యన్మూలే సర్వ తీర్ధాని, యన్మధ్యే సర్వ దేవతః !
యదగ్రే సర్వ వేదాశ్చ, తులసీం త్వాం నమామ్యహం!!
సర్వ తీర్ధాలు, సకల దేవతలు, సర్వ వేదాలు తనలోనే ఉన్నాయి అనే భావనతో నిత్యం కొలుచుకుంటాం. అదే తులసి సర్వ వ్యాధి నివారిణి కూడా..! తులసిని పూజలకు మాత్రమే పరిమితం చేయకుండా ఔషధంగా కూడా వాడవచ్చు అని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే అందులోని ఆరోగ్య ప్రయోజనాలు అనన్యం.
# కాచి చల్లార్చిన నీటిలో తులసి రసం కలుపుకుని పరగడుపున త్రాగితే మెదడు చురుకుగా పని చేస్తుంది.
# జ్ఞాపకశక్తి (memory power) ని మెరుగు పరచడంలో నోటి సంబంధిత వ్యాధులకు, ఉబ్బసానికి మంచి మందు తులసి (basil).
# చర్మ వ్యాధుల(skin diseases) కు ఈ ఆకురసం మంచి ఫలితాన్నిస్తుంది.
-> గాయాలకు, దెబ్బలకు, జంతువులు కరిచినపుడు ఈ ఆకు రసం రాసినా, పూసినా సత్వర ఉపశమనం కలుగుతుంది.
# తులసి చెట్లు వాతావరణ కాలుష్యాన్ని (environmental pollution) అరికడతాయి. దోమలను (mosquitoes) ఇంటిలోనికి చేరకుండా చేసి వాటి ద్వారా వచ్చే జబ్బుల బారిన పడకుండా చేస్తాయి.
# మలేరియా (malaria) వ్యాధి నిర్మూలనకు కూడా తులసి మంచి ఔషధం.
# క్షయవ్యాధి (tuberculosis) కి కారణమయ్యే బాక్టీరియా పెరుగుదలను అరికడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
# రక్త శుద్ధి మెరుగు పడటానికి, వ్యాధి నిరోధక శక్తి (immunity) అభివృద్ధికి తులసి రసం, బెల్లం కలిపి సేవించాలి.
# కాలేయ వ్యాధులు (liver diseases) నయం అవ్వటానికి కాలేయం చురుకుగా పని చేయటానికి తులసి మంచి ఔషధం.
# షుగర్ మెడిసిన్ (diabetes medicine) పనితనానికి కూడా తులసిని వాడుతున్నారు.
# తులసి రసం, అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటే జీర్ణ క్రియ సవ్యంగా సాగుతుంది. జీర్ణకోశ సమస్యలు ఉండవు.
# తులసి రసాన్ని తేనె (honey) తో కలిపి తీసుకుంటే నోటిపూత, గొంతు నొప్పి తగ్గుతుంది. బొంగురుపోయిన గొంతు శ్రావ్యంగా వస్తుంది.
# అధిక కొవ్వు (extra fat) కరిగి బరువు తగ్గటానికి మజ్జిగలో తులసి ఆకులను కలిపి తాగాలి.
# తులసి రసం, ఉల్లిపాయ రసం, అల్లం రసం, తేనె కలిపి 6 స్పూన్స్ ఉదయం, సాయంత్రం తాగితే విరేచనాలు, రక్త విరేచనాలు (diarrhea) తగ్గుతాయి.
# తులసి ఆకుల కషాయాన్ని తరచూ తీసుకుంటూ ఉంటే ఉబ్బసం (asthma) తగ్గుతుంది.
# సాధారణ జ్వరాలు వస్తే తులసి కాషాయం తాగితే తగ్గిపోతాయి. తులసి చెట్టు కాండము దంచి కాషాయం కాచి ప్రతి రోజు రాత్రి పూట తాగుతుంటే టైఫాయిడ్ (typhoid) జ్వరం కూడా తగ్గుతుంది.
# శరీరంలో శక్తిని పెంచటానికి, ఎర్ర రక్తకణాల పెంపుకు, కీళ్ల సమస్యలు, రక్త స్రావం నిరోధించటానికి లవంగ తులసి మేలైనది.