ప్రపంచంలో ప్రజలంతా కరోనాకు మందోమాకో తొందరగా తయారవుతుందని ఎదురుచూస్తున్నారు. ఇదే విధంగా కరోనా ఇంకా బలంగా ఉన్నపుడే మందో మాకో, లేదా వ్యాక్సినో తయారుచేసి మార్కెట్లో పడేస్తే బాగా అమ్ముడువోతుందని ప్రపంచంలోని మందుల కంపెనీలన్నీ పోటీ పడి పరిశోధనలు, పరీక్షలుచేస్తున్నాయి.
మార్కెట్ ను దృష్టి లో పెట్టుకుని మామందొస్తాంది, మా వ్యాక్సినొస్తావుందని ఈ కంపెనీలన్నీవూరిస్తున్నాయి.
అదేవిధంగా ఇలాంటి ప్రకటనొలచ్చినపుడంతా, హమ్మయ్య, ఇక పర్వాలేదు, ఈ వ్యాక్సీనొకటి పొడిపించుకుంటే సరి, ఇక నిర్భయంగా మునుపటిలా జాలీగా తిరగొచ్చు, సినిమాలకు షికార్లకు చెక్కేయవచ్చు, మాల్స్ కెళ్లవచ్చు, బార్ల లోకి దూరవచ్చు. తిరుపతి ఏడుకొండలవాడి దర్శనానికి జంకు గొంకూ లేకుండా సాగిపోవచ్చని జనమూ ఉబ్బి తబ్బిబ్బయి పోతున్నారు. అందుకే వ్యాక్సిన్ పరీక్షల టైమ్ లైను సాధ్యమయినంతవరకు కుదించుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.ఈ వేడిమీద వ్యాక్సిన్ తయారు చేసేందుకు పరుగుపెడుతున్నాయ్ కంపెనీలు. ఇప్పటికే ఉత్తి ప్రకటనలతోనే కంపెనీల షేర్ల రేట్లు విపరీతంగా పెరిగి బాగా సొమ్ము చేసుకున్నాయ్.
ఇపుడే,కరోనా జోరుగా స్వైరవిహరాం చేస్తున్ననపుడే ఆ వ్యాక్సిన్ ను తయారు చేస్తే కోట్లడాలర్లు పోసి ముందే కొనేందుకు దేశాలన్నీసిద్ధమవుతున్నాయి.
అంతర్జాతీయ పెద్దన్న ప్రెశిడెంట్ ట్రంప్ ఆపరేషన్ వార్ప్ స్పీడ్ ఇన్సియేటివ్ (Operation Warp Speed )అనే స్కీం ప్రకటించారు.
ఇదేంటంటే, వ్యాక్సిన్ తయారీలో బాగా ముందున్న కంపెనీలకు దండిగా ఆర్థిక సాయం చేసి, వ్యాక్సిన్ ని తొందరగా తయారు చేయించి భారీగా కొనుగోలు చేసే స్కీం.
అమెరికా ఇలాంటి ఖర్చులకు 10 బిలియన్ డాలర్లు కేటాయించింది. జనవరి 2021 నాటికి సురక్షితంగా, చక్కగా , సమర్థవంతంగా పనిచేసే వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలకు ఈ నిధులందిస్తారు.
మరొక వైపు తొందరగా వ్యాక్సిన్ తయారుచేయించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ((WHO) కూడా పరీక్షలను, ప్రయోగాలను కోఆర్టినేట్ చేస్తూ ఉంది.
తయారీలో ఉన్న వ్యాక్సిన్ లను వ్యాక్సిన్ క్యాండిడేట్ అని పిలుస్తారు.
ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్ల ఉద్యేశమేమిటంటే…మనశీరంలోకి ప్రవేశించి కరోనావైరస్ వంటి దుర్మార్గులను ఉన్నశక్తికంటే మరింత శక్తి సంపాయించుకుని దానిని ప్రయోగించి అంతమొందించేలా చేయడమే.
మనలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థకు సహజంగా కొంతశక్తి ఉంటుంది. అయితే, కరోనా వంటి కొత్త దుష్ఠశక్తులు శరీరంలోకి ప్రవేశించినపుడు ఆ ఇమ్యూనిటీ చాలదు. అందువల్ల ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్ శరీరంలోకి ప్రవేశించి, వాటిని ఎదుర్కొనేశక్తి ఉన్న యాంటిబాడీలను పుట్టించి, దుష్టశక్తులను అంతచేసేలా చేస్తాయి. అయితే, ఈ ప్రాసెస్ లో చెడు ప్రభావాలుండ కూడదు.అందుకే ఆలస్యమయ్యేది.
అందుకే ఇపుడు ఎన్నోరకాల పద్దతుల్లో వ్యాక్సిన్లను తయారు చేస్తున్నారు. ఇందులోకొన్నింటిన కరోనావైరస్ నిర్వీర్యం చేసి తయారు చేసిన వ్యాక్సిన్లు. మరి కొన్ని కరోనా వ్యాక్సిన్ నుంచి ఒక ముక్క తీసుకుని తయారుచేసినవి. మరికొన్ని కరోనావైరస్ నుంచి సేకరించిన జెనెటిక్ మెటీరియల్నుంచి తయారు చేసినవయితే, మరికొన్ని వైరస్ ప్రొటీన్ నుంచి తయారు చేసినవి. మొత్తానికి ఇవన్నీ చేసే పని ఒకటే. కరోనా వైరస్ ప్రొటీన్ లను తాత్కాలికంగా మన శరీరం లో తయారుచేయించి, వాటిని మీద ఎదుర్కొనేలా మన ఇమ్యూన్ సిస్టాన్ని ఉత్తేజపరుస్తాయి.వ్యాక్సిన్లంటే ఏమిటి, అవెలా పని చేస్తాయ్ మరింత వివరంగా తెలుగుసుకోవాలనుకుంటున్నారా? అయితే Overview, History, and How the Safety Process Works మీద క్లిక్ చేయండి.
సాధారణంగా వ్యాక్సిన్ తయారుచేయడమనేది యూట్యూబ్ లో చూస్తూ కరకరలాడేలా మిర్చిబజ్జీ వేయడం లాంటిది కాదు. పదినుంచి పదహైదేళ్లు పట్టే దీర్ఘకాలిక పోరాటం.
సంప్రదాయం ప్రకారం వ్యాక్సిన్ తయారీ అయిదు దశలలో పూర్తవుతుంది.
ఇందులో మొదటి దశ, డిస్కవరీ పరిశోధన. అంటే వ్యాక్సిన్ కనిపెట్టే పరిశోధన, దీనికి రెండు నుంచి 5 సంవత్సరాలు పడుతుంది.
రెండోది ప్రిక్లినికల్ దశ. ఇది రెండేళ్లు పడుతుంది. మూడోది క్లినికల్ డెవెలప్ మెంట్ దశ. ఇందులో మొదటి ఉపదశ ఒకటి రెండేళ్లు సాగుతుంది. రెండో ఉపదశ మరొక రెండునుంచి మూడేళ్లు సాగుతుంది.
మూడో ఉపదశ రెండు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది.
నాలుగో దశ రెగ్యులేటరీ రివ్యూ ,అప్రూవల్ వ్యవహారానికి సంబంధించింది. దీనికి ఒకటి నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది.
చివర అయిదో దశ , వ్యాక్సిన్ తయారు చేసి, ప్రజలకు అందించే దశ. ఈ మొత్తం అయిదు దశలకు పదేళ్లుపడుతుందని, ఖర్చు 500 మిలియన్ డాలర్లు పడుతుందని అంచనా. దీని మీద ఇంకా లోతుగా వివరాలు కావాలంటే 5 Charts that tell the story of Vaccines today మీద క్లిక్ చేయండి.
మంప్స్ (గవద బిల్లలు) గురించి తెలుసుగా. దీనికి 1960లో వ్యాక్సిన్ తయారు చేసేందుకు నాలుగు సంవత్సరాలు పట్టిందంటే నమ్ముతారా?
ఈ వైరస్ ను 1945లో వేరు చేశారు.నాలుగేళ్ల తర్వాత 1948కి నిర్వీర్యమయిన వ్యాక్సిన్ తయారయింది. దాంతో వాడటం జరగలేదు.
1967 మార్చి 30 యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్ Mumpsvax వ్యాక్సిన్ కి అనుమతినిచ్చారు.దీనిని డెవలప్ చేసిన శాస్త్రవేత్త డాక్టర్ మారిస్ హిల్ మన్ (Dr Mauric R Hilleman) ఈ వ్యాక్సిన్ ని ఈ dవ్యాధివచ్చిన తన అయిదేళ్ల కూతురు జెరైల్ లిన్ హిల్ మన్ (Jeryl Lynn Hilleman) నుంచి సేకరించిన వైరస్ తో తయారు చేశాడు.అందుకే దీనిని జెరైల్ లిన్ స్ట్రెయిన్ అంటారు. తర్వాత దానిని అమెరికాలో వాడవచ్చని సిఫార్సు చేసేందుకు మరొక పదేళ్లు పట్టింది అంటే 1977లో అనుమతించారన్నమాట. ఈ కథేందో Tracing the story of Mumps: A Timeline మీద క్లిక్ చేసి చదవండి.
సరే, ఇపుడెవరూ ఇదంతా వినేందుకు ఒపిక ఉండదు. ఎందుకంటే, ఏమో టెక్నాలజీ మారిపోయాక వ్యాక్సిన్ టైమ్ లైన్ తగ్గిందేమో అనే వారుండవచ్చు. అందుకే ఇపుడు రేసులో ఉన్నకంపెనీల వ్యాక్సిన్ క్యాండిడేట్లేవో చూద్దాం.
1.మాడెర్నా థెరప్యూటిక్స్ అనే కంపెనీ అమెరికా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సహకారంతో వ్యాక్సిన్ ను తయారుచేస్తున్నది. ఈ వ్యాక్సిన్ పేరు: mRNA-1273 .కరోనా వైరస్ జెనెటిక్ మెటీరియల్ తునక నుంచి దీనిని తయారుచేస్తున్నారు.
2. ఫైజర్ (Pfizer) కంపెనీ చేస్తున్న వ్యాక్సిన్ పేరు BNT162b2. ఫైజర్ కంపెనీ దీనిని జర్మనీ బయోటెక్ కంపెనీ BioNTech సహకారంతో తయారుచేస్తున్నది. ఇది mRNA నుంచే తయారవుతున్నది. వీళ్ల దగ్గిరనుంచి 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్ కొనేందుకు అమెరికా ప్రభుత్వం 2బిలియన్ డాలర్లు కాంట్రాక్టు కుదుర్చుకుంది.
3. ఆక్సఫర్డ్ యూనివర్శిటీ బయోఫార్మష్యూటికల్ కంపెనీ ఏస్ట్రా జెనెకా (AstraZeneca) సహకారంతో ఈ వ్యాక్సిన్ ను తయారుచేస్తున్నది. దీనిపేరు ChAdOxnCoV-19.ఇది ట్రోజన్ హార్స్ వ్యాక్సిన్. మిగతా వ్యాక్సిన్ లకంటే చిత్రమైందిది.
4. సినోవాక్ (Sinovac) .చైనాకు చెందిన ఈ కంపెనీ బ్రెజిలియన్ రీసెర్చ్ సెంటర్ (బ్యూటాంటా)తో కలసి దీనిని తయారుచేస్తున్నది. ఇది ఇనాక్టివేటెడ్ కరోనా వైరస్ నుంచి తయారు చేసిన వ్యాక్సిన్ ఇది. ఇది పది రకాల SARS-CoV-2 వైరస్ లను అంతమొందించిందని చెబుతున్నారు.
5. సైనో ఫార్మ్ అనే చైనా కంపెనీ వూహాన్ ఇన్ స్టిట్యూట్ ఆప్ బయోలాజికల్ ప్రాడక్ట్స్ సహకారంతో ఈ వ్యాక్సిన్ ను తయారుచేస్తున్నది. 2020 నాటికి వ్యాక్సిన్ తయారవుతుందని చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ పరీక్షలకు రకరకాల జాతులు ప్రజలున్న యుఎఇ దేశాన్ని పరీక్షల కోసం ఎంపిక చేసుకున్నారు.
6. ముర్దోక్ చిల్డ్రెన్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ అనేది ఆస్ట్రేలియా మెల్ బోర్న్ పరిశోధనా సంస్థ. Bacillus Calmette-Guerin BRACE trial అనేది ఈ వ్యాక్సిన్ పేరు.
7. క్యాన్ సైనో బయాలజిక్స్ (CanSino Biologics) అనే చైనా కంపెనీ తయారు చేస్తున్న వ్యాక్సిన్ పేరు Ad5-nCoV. ఇది వైరల్ వెక్టర్ వ్యాక్సిన్.
8. ఈ జాబితాలో రష్యా Gamaleya Institute of Epidemiology వ్యాక్సినొకటి పరీక్షలు పూర్తిచేసుకుంటున్నది. ఇది అక్టోబర్ కల్లా వస్తుందని రష్యా చెబుతూ ఉంది.
మరి ఇందులో ఏది ముందువస్తుందో ఎవరూచెప్పలేకపోతున్నారు. అదీ సంగతి.